Mumbai: బాలిక ప్రాణాలు కాపాడేందుకు మేము సైతం అన్న ఆసుపత్రి వైద్యులు.. పేస్‌మేకర్‌ కోసం లక్ష విరాళం

|

Nov 06, 2024 | 11:15 AM

వైద్యో నారాయణి హరిః అన్నారు పెద్దలు. భారత దేశంలో డాక్టర్ కు ఉన్నత స్థానం ఇచ్చారు. ఇలలో వెలసిన నారాయణుడితో సమానంగా భావిస్తారు. భగవంతుడు ప్రాణం పోస్తే.. భూమి మీద మనుషులకు పునర్జన్మని ఇస్తాడు. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. ముంబైలోని వైద్య సిబ్బంది. 13 ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడేందుకు సియోన్ హాస్పిటల్‌లోని వైద్యులు అధునాతన పేస్‌మేకర్‌ను అమర్చేందుకు లక్ష రూపాయలను విరాళంగా అందించారు. BMC నిర్వహిస్తున్న సియోన్ హాస్పిటల్‌లోని వైద్యులు చాందీ గౌడ్‌ను రక్షించడానికి రూ. 1 లక్ష విరాళం ఇచ్చారు. 13 ఏళ్ల బాలిక దహిసర్ నివాసి. అతి తక్కువ హృదయ స్పందన రేటుతో జన్మించింది.

Mumbai: బాలిక ప్రాణాలు కాపాడేందుకు మేము సైతం అన్న ఆసుపత్రి వైద్యులు.. పేస్‌మేకర్‌ కోసం లక్ష విరాళం
Sion Hospital Donate One Lakh
Follow us on

ముంబైలోని బీఎంసీ ఆధ్వర్యంలో నడిచే సియోన్ హాస్పిటల్‌లోని వైద్యులు తమ విధులతో పాటు మానవత్వాన్ని కూడా చూపించారు. ఒక చిన్నారి ప్రాణాలను నిలబెట్టడానికి ఒక అడుగు ముందుకేసి.. అలసి పోయి నెమ్మదిగా స్పందించే హృదయానికి పేస్‌మేకర్‌ను అమర్చారు. పుడుతూనే గుండె జబ్బుతో జన్మించిన 13 ఏళ్ల దహిసర్ నివాసి చండీ గౌడ్ తరచుగా ముర్చపోతుంది. అంతేకాదు గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది కూడా.. దీంతో ఆ చిన్నారి బాలిక ప్రాణాలను కాపాడటానికి డాక్టర్స్ ముందుకొచ్చారు. పేస్‌మేకర్ అనేది కాలర్‌బోన్ దగ్గర చర్మం కింద అమర్చే ఒక చిన్న లోహ పరికరం. ఇది రెండు ఎలక్ట్రికల్ లీడ్స్ ద్వారా గుండెకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ పేస్‌మేకర్ ను అమర్చడం వలన గుండె లయ నిమిషానికి 60-100 మధ్య కొట్టుకునే విధంగా చేస్తుంది. ఇది సాధారణ విద్యుత్ ప్రేరణలను పంపుతుంది.

అయితే చండీ గౌడ్ కు అత్యవసరంగా పేస్‌మేకర్ ను అవసరం ఉంది. ఈ పేస్‌మేకర్ కోసం రూ. 7 లక్షల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పేస్‌మేకర్ ను అమర్చడానికి సుమారు లక్ష ఖర్చు అవుతుంది. దీంతో ఈ పేజ్ మేకర్ ను ఆ బాలిక కు అమర్చే ప్రక్రియ ఖర్చుగా మొత్తం రూ. 8 లక్షలు కావాల్సి ఉంది. అయితే ఈ పరికరం ప్రభుత్వ బీమా పథకాల పరిధిలోకి రాకపోవడంతో.. కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యులు బాలిక వైద్యానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మన దేశంలో ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్ ఇండియా లిమిటెడ్ బాలిక చికిత్స కోసం పేస్‌మేకర్‌ను విరాళంగా అందించింది. మిగిలిన మొత్తాన్ని భర్తీ చేయడానికి మెడికోలు సహకరించారు.

2017లో చండీ గౌడ్ మొదటి సారి పేస్‌మేకర్‌ని సియోన్ హాస్పిటల్‌లో వేయించుకుంది. అయితే బాలికకు ఇంప్లాంటేషన్ సైట్‌లో ఇన్‌ఫెక్షన్‌ పెరిగింది. యాంటీబయాటిక్స్ సమస్య పరిష్కారం కాకపోవడంతో పరికరాన్ని మార్చాల్సి వచ్చిందని కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ ప్రతాప్ నాథని తెలిపారు. మే 2024లో మళ్ళీ బాలికకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ బాలికకు ఉత్తరప్రదేశ్‌లోని వైద్య కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ మరో పేస్‌మేకర్‌ను అమర్చారు. అయితే మళ్ళీ ఒక నెలలోనే మళ్లీ ఇన్ఫెక్షన్ సోకింది” అని డాక్టర్ చెప్పారు. దీంతో ఇప్పుడు పేస్‌మేకర్‌ను మార్చాల్సి వచ్చిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..