Zebra Crossing: కోర్టు ముందే అబద్దాలు.. జీబ్రా క్రాసింగ్ పేరుతో విద్యార్థి సాకులు.. చివరికి 6 నెలలు జైలు శిక్ష

|

Aug 22, 2022 | 8:50 PM

Zebra Crossing: తరచుగా ప్రజలు జీబ్రా క్రాసింగ్ లేకుండా రోడ్డు దాటుతుంటారు. అలా దాటడం చాలా ప్రమాదకరం. ఏది ఏమైనా నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం చట్ట విరుద్ధం...

Zebra Crossing: కోర్టు ముందే అబద్దాలు.. జీబ్రా క్రాసింగ్ పేరుతో విద్యార్థి సాకులు.. చివరికి 6 నెలలు జైలు శిక్ష
Follow us on

Zebra Crossing: తరచుగా ప్రజలు జీబ్రా క్రాసింగ్ లేకుండా రోడ్డు దాటుతుంటారు. అలా దాటడం చాలా ప్రమాదకరం. ఏది ఏమైనా నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం చట్ట విరుద్ధం. కానీ ముంబైలో జీబ్రా క్రాసింగ్ కోసం ఒక యువకుడు సాకుగా చెప్పడం వల్ల ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు 24 ఏళ్ల విద్యార్థికి ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధించింది. అతను 2019లో అంధేరీలో ఓ జంటను బైక్‌తో ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బైక్‌తో ఢీకొనడంతో ఆ జంటకు చెందిన ఏడాదిన్నర కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాలిక ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పిల్లల తల్లిదండ్రులకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలని నిందితుడికి కోర్టు ఆదేశించింది.

అయితే అక్కడ జీబ్రా క్రాసింగ్ లేదని, తన తప్పు లేదని నిందితుడి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రజలు రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్‌ కోసం చూడరని కోర్టు తెలిపింది. ప్రమాదాల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని, రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది చిన్నారులు, పెద్దలు మరణిస్తున్నారని కోర్టు పేర్కొంది. జీబ్రా క్రాసింగ్ లేదా ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడం ప్రాసిక్యూషన్ సాక్షులు లేదా నిందితుల చేతుల్లో లేదని తెలిపింది. అయితే జీబ్రా క్రాసింగ్‌ పేరుతో తప్పించుకుందామన్న నిందితుడికి ఎదురుదెబ్బే తగిలింది. నేరస్థుల పరిశీలన చట్టం ప్రకారం.. ఒక నిందితుడు శిక్ష అనుభవించడానికి బదులుగా మంచి ప్రవర్తన బాండ్‌పై విడుదల చేయవచ్చు. అయితే నిందితుడు మహ్మద్ అహ్మద్‌ను నిర్దోషిగా ప్రకటించేందుకు ముంబై మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి