Mumbai Building Collapse: మహారాష్ట్రలోని ముంబై నగరంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా.. 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని శాస్త్రినగర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. సమాచారం అందుకున్న బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.
భవనం కూలిన ఘటనలో ఒకరు మరణించారని.. గాయపడిన 16 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందరికి స్వల్ప గాయాలైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని.. శిథిలాలను తొలగిస్తున్నట్లు తెలిపింది. కాగా.. భవన శిథిలాల్లో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Maharashtra | One person died and 16 people admitted with minor injuries after a G+2 structure collapsed at Shastri Nagar, Bandra West. Rescue operation underway: Brihanmumbai Municipal Corporation pic.twitter.com/EJwQby3cxm
— ANI (@ANI) June 8, 2022
బాధితులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. భవన నిర్మాణ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని.. భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని డీసీపీ మంజునాథ్ సింగే తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..