మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. ఓ 17 ఏళ్ల బాలుడిని హత్య చేసి అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ ఆటో డ్రైవర్ పగ తీర్చుకోవడం కలకలం రేపింది. మరో విషయం ఏంటంటే అరెస్టు అయిన ఆ ఆటోడ్రైవర్ భార్య.. హత్యకు గురైనటువంటి బాలుడ్ని సోదరుడిగా భావించినట్లు తెలిసింది. ముంబయిలోని ఆర్సీఎఫ్ పోలీసులు బుధవారం ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు. అయితే మృతుడు తన భార్యపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశాడని.. అలాగే ఆమెను ఎక్కడపడితే అక్కడ అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడని.. అందుకోసమే హత్య చేశానని.. ఆ ఆటోడ్రైవర్ చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ బాలుడ్ని హత్య చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి.. ఆ శరీర భాగాలను వంట గదిలో దాచి పెట్టాడని.. అనంతరం ఆ మక్కలు బయట పారేసేందుకు ఆటో డ్రైవర్ ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే అంతలోనే ఆ ఆటో డ్రైవర్ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడు షఫిక్ అలియాస్ షఫీ షేక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు పేర్కొన్నారు. ఆగస్టు 28వ తేదిన బాలుడ్ని ఆ ఆటో డ్రైవర్ షపిక్ షేక్ హత్య చేసినట్లు డీసీపీ హేమ్‌రాజ్ సింగ్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. ఈశ్వర్ మార్వాడి అనే బాలుడు హత్యకు గురైనట్లు పేర్కొన్నారు. కొడవలితో ఈశ్లర్‌ను నరికి చంపిన తర్వాత అతడి తలపై ఆటో డ్రైవర్ సుత్తితో బాదాడని తెలిపారు. అయితే ఈశ్వర్ హత్యకు నిందితుడు వినియోగించిన.. కొడవలి, సుత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఇక ఆటో డ్రైవర్ షేక్ గతంలో ఉరాన్ అనే ప్రాంతంలో ఉండేవాడు. అయితే ప్రస్తుతం తన భార్యతో కలిసి ఆర్సీఎఫ్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా 2013లో ఉరాన్‌లో ఉండగా జై నారాయణ్ అనే వ్యక్తిని షేక్ హత్యచేసినందుకు అరెస్టు అయ్యాడని.. అతడిపై దోపిడి కేసు కూడా ఉన్నట్లు పోలీసుల తెలిపారు. హత్య కేసులో కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడని.. ఆ తర్వాత గోవంది అనే మరో ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు.
అయితే 2013లో జరిగిన హత్యకేసులో తాను నిర్దోషిగా విడుదలైనట్లు షేక్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరణించిన బాలుడు ఈశ్వర్ కూడా చెంబూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనానికి యత్నించినలో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు చెప్పారు. ఆ తర్వాత అతడ్ని డోంగ్రీ చిల్డ్రన్స్ హోమ్‌కు పంపారని.. ఆ తర్వాత అక్కడి నుంచి అతడు బయటకు వచ్చాడని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ బాలుడే హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నామని ముంబయి పోలీసు అధికారులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..