AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Student Suicide: ’14 ఏళ్లకు అలా ఎందుకు జరుగుతుంది?’ భయంతో బాలిక ఆత్మహత్య..

ప్రతి ఆడపిల్ల జీవితంలో రుతుక్రమం తప్పనిసరి. వద్దని వదిలించుకునేందుకు వేరే మార్గం లేనేలేదు. దీని తాలూకు సమస్యలను ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. అయితే ఓ 14 ఏళ్ల బాలిక మాత్రం దీనిని భరించలేక పోయింది. మొదటి రుతుస్రావం కారణంగా ఎదురైన తీవ్రమైన బాధను తట్టుకోలేక జీవితాన్ని చాలించింది. ఈ విషాద ఘటన ముంబైలోని మల్వానీ ప్రాంతంలో చోటుచేసుకోవగా..

Student Suicide: '14 ఏళ్లకు అలా ఎందుకు జరుగుతుంది?' భయంతో బాలిక ఆత్మహత్య..
Teenager Suicide
Srilakshmi C
|

Updated on: Mar 28, 2024 | 12:13 PM

Share

ముంబయి, మార్చి 28: ప్రతి ఆడపిల్ల జీవితంలో రుతుక్రమం తప్పనిసరి. వద్దని వదిలించుకునేందుకు వేరే మార్గం లేనేలేదు. దీని తాలూకు సమస్యలను ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. అయితే ఓ 14 ఏళ్ల బాలిక మాత్రం దీనిని భరించలేక పోయింది. మొదటి రుతుస్రావం కారణంగా ఎదురైన తీవ్రమైన బాధను తట్టుకోలేక జీవితాన్ని చాలించింది. ఈ విషాద ఘటన ముంబైలోని మల్వానీ ప్రాంతంలో చోటుచేసుకోవగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ముంబాయిలోని మాల్వానిలోని లక్ష్మీ చాల్స్‌లో నివసిస్తున్న ఓ బాలిక 14 యేళ్లకు మెంస్ట్రువల్‌ పీరియడ్స్‌ మొదలయ్యాయి. అయితే ఋతు చక్రం గురించి బాలికకు ఎలాంటి అవగాహన లేదు. దీంతో ఆ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని భరించలేక ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి (మార్చి 26) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, ఇరుగుపొరుగు బాలికను హుటాహుటీన కందివలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో.. బాలికకు ఇటీవల మొదటి ఋతుస్రావం కారణంగా బాధాకరమైన అనుభవం ఎదుర్కొందని, ఆ కారణంగా కలత చెంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని మృతురాని బంధువులు తెలిప్పారు.

దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డిప్రెషన్‌ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు బాలిక స్నేహితురాళ్లను కూడా విచారిస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలాగే బాలిక ఆన్‌లైన్ కార్యకలాపాలను కూడా తెలుసుకుని, బాలిక ఆత్మహత్యకు దారి తీసిన అసలైన కారణం ఏమిటో తెలుసుకుంటామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అన్ని లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా రుతుక్రమానికి సంబంధించి టీనేజర్లలో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. సమాజంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడే సంస్కృతి లేకపోవడం, అవమానంగా భావించడం, అవగాహన లేమి ఇలాంటి దుర్ఘటనలకు దారి తీస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.