Mughal Garden: రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ రేపటినుంచి పర్యాటకులకు స్వాగతం పలకనుంది. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 21 వరకు ఉదయం నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య ఉచితంగా గార్డెన్‌లోకి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి భవన్‌తోపాటు మ్యూజియంలోకి కూడా ప్రవేశం ఉంటుంది. అయితే ముందస్తు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారినే అనుమతిస్తారు. పూర్తిస్థాయి కరోనా నిబంధనలతో గార్డెన్‌లోకి అనుమతించనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘ఉద్యానోత్సవ్’ను ప్రారంభించనున్నారు.
ఏడాదంతా రాష్ట్రపతి భవన్‌కే పరిమితమయ్యే 15 ఎకరాల మొఘల్ గార్డెన్‌లోకి ‘ఉద్యానోత్సవ్’ పేరిట ఏటా ఫిబ్రవరి- మార్చి నెలల్లో సందర్శకులకు అనుమతి ఉంటుంది. ఈ గార్డెన్‌లో తులిప్ పూలు, గులాబీలు, చేమంతులు వందల రకాల పూలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని మొఘల్ గార్డెన్ వద్ద ఎంట్రీ టికెట్లు ఇవ్వరని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతీ స్లాట్‌లో వందమందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read: