
Drdo 2 Dg Drug
MSN Labs Links DRDO: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతోపాటు కరోనా చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై కూడా దృష్టిసారించింది. ఈ క్రమంలో కరోనా చికిత్సకు వినియోగించే 2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వ సంస్థ డీఆర్‌డీఓ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్.. 2 డీజీ ఔషధ ఉత్పత్తికి సంబంధించి డీఆర్‌డీవోతో ఒప్పందం కుదుర్చుకుంది. డీఆర్‌డీవో డెవలప్ చేసిన 2 డీజీ ఔషధాన్ని కరోనా రోగులకు అత్యవసర చికిత్సలో వినియోగించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొన్ని రోజుల క్రితం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే డీఆర్‌డీవోతో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఒప్పందం మేరకు.. 2 డీజీ ఔషధాన్ని ఎంఎస్ఎన్ 2డీ పేరుతో ఎంఎస్ఎన్ ల్యాబ్ మార్కెట్‌లోకి తీసుకురానుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 2.34 గ్రాములతో రోజుకు రెండు సాచెట్స్‌ను సదరు ల్యాబ్ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎంఎస్ఎన్ ల్యాబ్ పలు రకాల కరోనా ఔషధాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. యాంటీ వైరల్ మెడిసిన్స్‌ను ఒసెలో బ్రాండ్ పేరుతో ఓసెల్టామివిర్ క్యాప్సూల్స్‌ను సైతం విడుదల చేసింది. ఫావిలో బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ వంటి యాంటీ కోవిడ్ డ్రగ్స్‌ను, బారిడోజ్ బ్రాండ్ పేరుతో బారిసిటినిబ్, పోసాయోన్ బ్రాండ్ పేరుతో పోసాకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ డ్రగ్స్‌ను ఎంఎస్ఎన్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. తాజాగా డీఆర్‌డీఓ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. 2 డీజీ ఔషధ ఉత్పత్తి మరింత వేగంగా జరగనుంది.
కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ సమయంలో ఐఎన్ఎంఎఎస్- రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ ఔషధం ల్యాబ్ ట్రయల్స్ ప్రారంభించగా.. మెరుగైన ఫలితాలు కనిపించాయి. దీంతో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.
Also Read: