MPs Covid-19 Tests: బడ్జెట్‌ సమావేశాలు.. ఎంపీలంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందే: లోక్‌సభ స్పీకర్‌

Mps Covid-19 Tests: జనవరి 29నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని లోక్‌సభ..

MPs Covid-19 Tests: బడ్జెట్‌ సమావేశాలు.. ఎంపీలంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందే: లోక్‌సభ స్పీకర్‌

Edited By:

Updated on: Jan 20, 2021 | 12:59 PM

Mps Covid-19 Tests: జనవరి 29నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. కోవిడ్‌ దృష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌ సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశం అవుతారని వెల్లడించారు. సెప్టెంబర్‌లో జరిగిన విధంగానే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతాయని అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగం మాత్రం సెంట్రల్‌ హాల్‌లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమావేశానికి వచ్చే ఎంపీలు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఎంపీల పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇందు కోసం ఈనెల 27,28 తేదీల్లో పార్లమెంట్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓంబిర్లా పేర్కొన్నారు.

Also Read:

Budget-2021: ఈ సారి ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్.. పెట్టుబడిదారులకు మరింత విశ్వాసం పెంచనున్న బడ్జెట్‌

2021 బడ్జెట్.. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఎంతవరకు ఉపశమనం లభించనుంది.. నిపుణులెమంటున్నారు ?