ఓ మహిళ వాట్సాప్ డీపీ ద్వారా రూ.50 లక్షల విలువైన నగలు చోరీకి గురైన విషయం తెలిసింది. ఈ చోరీకి పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేయడంతో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. నెలకు 8 వేల రూపాయల జీతం మాత్రమే తీసుకుంటున్న మహిళా పనిమనిషి ఇంట్లో ఏసీ మొదలు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ మహిళకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఒక డీపీఫోటో తన దొంగతనాన్ని ఎలా బయటపెట్టిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది ఈ సంఘటన. వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని టిటి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషాత్ కాలనీలో నివసిస్తున్న డా. భూపేంద్ర శ్రీవాస్తవ తన ఇంట్లో విలువైన నగలు చోరీకి గురయ్యాయని పోలీసులు ఫిర్యాదు చేశారు. షాజహానాబాద్ ప్రాంతంలో భూపేంద్రకు ప్రైవేట్ ఆసుపత్రి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా తన ఇంట్లో విలువైన ఆభరణాలు, డబ్బు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 20 రోజుల క్రితం దొంగతనం చేశారనే అనుమానంతో ఇంట్లో పనిమనిషిని తొలగించామని చెప్పారు.
డాక్టర్ భూపేంద్ర శ్రీవాస్తవ.. అతని భార్య దగ్గర పనిమనిషి వాట్సాప్ నంబర్ ఉంది. పనిమనిషి వాట్సాప్ డీపీ ఫొటోను చూడగా.. పనిమనిషి ధరించిన చెవిపోగులు ఆమెవేనని భార్య అనుమానించింది. ఆ తర్వాత లాకర్ తెరిచి చూడగా తన చెవిపోగులు కూడా మాయమైనట్లు గుర్తించారు. దాంతో ఇంట్లోని ఆభరణాలు దొంగిలించింది పనిమనిషి అని అనుమానిస్తూ డాక్టర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించినట్టుగా చెప్పారు.
డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పనిమనిషిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను డాక్టర్ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించింది. నిందితురాలి నుంచి రూ.60 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఐదున్నర లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన మాటల మేరకు.. డాక్టర్ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో దొంగతనం చేసినట్టుగా అంగీకరించింది. అలాగే ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలంటే డాక్టర్ భార్య నగలు వేసుకునే వెళ్లేదని చెప్పింది.
నిందితురాలైన మహిళా వైద్యుడి ఇంట్లో పని చేస్తూ నెలకు రూ.8 వేలు జీతం తీసుకుంటోంది. కాగా ఆమె భర్త కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు.. నెలకు 15 వేల నుంచి 20 వేల వరకు ఆదాయం ఉన్న ఈ మహిళ ఇంట్లో ఏసీ, సీసీ కెమెరాతోపాటు సకాల సౌకర్యాలు ఉండటం చూసి పోలీసులు నివ్వేరపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..