Bycott: కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరసన.. రక్షణ విధానాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ ఫైర్

|

Jul 14, 2021 | 7:39 PM

కేంద్ర వ్యవహార శైలిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

Bycott: కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరసన.. రక్షణ విధానాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ ఫైర్
Revanth Reddy
Follow us on

MP Rahul Gandhi and Revanth Reddy Walks Out: కేంద్ర వ్యవహార శైలిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఎజెండా ప్రకారం సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చించాలని ప్రతిపక్షనేతలు పట్టుబట్టారు. అయితే, అందుకు కమిటీ చైర్మన్ జుయల్ ఓరం నిరాకరించారు. చైర్మన్ తీరుకు నిరసనగా కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


కాగా, అంతకు ముందుకు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాట వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. రక్షణ, విదేశాంగ విధానాలను దేశీయ రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. భారత్ రక్షణ విషయంలో ఎప్పుడూ ఇంత బలహీనంగా లేదని విమర్శించారు. దీనికి సంబంధించి ఓ పేపర్ క్లిప్పింగ్‌ను కూడా రాహుల్ ట్వీట్‌కు జత చేశారు. అయితే, ఈ ట్వీట్ పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తీవ్రంగా మండిపడ్డారు. ఫేక్ న్యూస్ ఆధారంగా రాహుల్ ట్వీట్లు చేస్తున్నారని, అలా చేయడం ఏమాత్రం భావ్యం కాదని సంబిత్ పాత్రా హితవు పలికారు.


Read Also… Monkeys Terror: పంట పొలాలపై వానర సేనల దండయాత్ర.. కిష్కిందకాండను అడ్డుకునేందుకు రైతుల వినూత్న ప్రయోగం