వ్యవసాయం ఇప్పుడు భారమైపోయింది. పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా తిరిగిరాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి చాలవు అన్నట్లు కల్తీ విత్తనాలు, ఎరువురు వారిని నట్టేట ముంచుతున్నాయి. వ్యవసాయం మాత్రమే కాదు.. ఓ పెద్ద యుద్దమే చేస్తున్నాడు రైతు. ఈ క్రమంలో వారు వ్యవసాయ ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు. కాగా వ్యవసాయం చేయాలంటే ప్రస్తుత కాలంలో ట్రాక్టర్ తప్పనిసరి అయ్యింది. దీంతో లక్షలు పెట్టి దాన్ని కొనలేని వ్యక్తి.. ఓ ప్రత్యామ్నాయ మార్గంతో ముందుకొచ్చాడు. మధ్యప్రదేశ్ విదిశా జిల్లా ఘట్వాయీ గ్రామానికి చెందిన విజయ్ సింగ్ రఘువంశీ అనే రైతుకు ఓ క్రేజీ థాట్ వచ్చింది. ఆటో ఇంజిన్‌తో ఓ మినీ ట్రాక్టర్‌ను తయారుచేశాడు. ఇందుకోసం అతడు కేవలం రూ. 25వేలు మాత్రమే ఖర్చు పెట్టాడు.
పాడైపోయిన ఆటో నుంచి ఇంజిన్ కొనుగోలు చేసిన విజయ్ సింగ్.. దానిని స్థానిక మెకానిక్‌తో రిపేర్ చేయించాడు. తానే సొంతంగా ట్రాక్టర్ బాడీ తయారుచేశాడు. ఇంజిన్ అమర్చి, బాడీకి మూడు చక్రాలు బిగించి మినీ ట్రాక్టర్‌ను రెడీ చేశాడు. ఈ కొత్త యంత్రంతో విజయ్‌కు.. తన 1.5 ఎకరాల భూమిలో సాగు ఈజీ అయ్యింది. దీనితో 3 గంటల్లో పావు ఎకరాన్ని దున్నవచ్చు. ఇందుకు కేవలం ఒకటిన్నర లీటర్ల డీజిల్ అవసరం అవుతుందని సదరు రైతు చెబుతున్నాడు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మినీ ట్రాక్టర్‌ను గ్యాస్‌తో కూడా నడిచే విధంగా విజయ్ సింగ్ ఏర్పాటు చేశాడు. 5హెచ్‌పీ డీజిల్ ఇంజిన్‌ను స్టార్ట్ చేశాక గ్యాస్‌తో నడిచే విధంగా మార్చుకోవచ్చని విజయ్ సింగ్ వివరించాడు. 14 లీటర్ల గ్యాస్‌తో 58 నుంచి 62 గంటల పాటు ఇంజిన్ పనిచేస్తుందని తెలిపాడు.
Also Read: ఇన్ని పండ్లు ఒకే చోట.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి