కాంగ్రెస్ తాత్కాలిక సారథి మోతీలాల్ వోరా

| Edited By: Srinu

Jul 03, 2019 | 7:48 PM

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా ఎంపికయ్యారు. 90 ఏళ్ళ వోరా ఛత్తీస్ గడ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం ఏఐసీసీకి ఆయన జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీ కోశాధికారిగా పని చేశారు. పార్టీకి కొన్ని దశాబ్దాలుగా ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ చీఫ్ గా ఆయనను ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా, యూపీ గవర్నర్‌, మధ్యప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. ఒక దశలో […]

కాంగ్రెస్ తాత్కాలిక సారథి మోతీలాల్ వోరా
Follow us on

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా ఎంపికయ్యారు. 90 ఏళ్ళ వోరా ఛత్తీస్ గడ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం ఏఐసీసీకి ఆయన జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీ కోశాధికారిగా పని చేశారు. పార్టీకి కొన్ని దశాబ్దాలుగా ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ చీఫ్ గా ఆయనను ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా, యూపీ గవర్నర్‌, మధ్యప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. ఒక దశలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు వోరా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు.