Girl Child: ‘చేతులెలా వచ్చాయమ్మా..?’ ఆడపిల్ల పుట్టిందనీ 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపిన తల్లి

|

Jul 28, 2024 | 8:51 PM

ఆడిపిల్లంటే అందరికీ అలుసే. కనడానికి అమ్మకు బరువు. పెంచడానికి నాన్నకు బెదురు. కొడుకుతో సమానంగా చూసేందుకు ఏ ఒక్కరికీ మనసేరాదు. ఆడశిశువును ఓ చీడ పరుగులా, కట్టుబానిసగా భారత సమాజం నేటికీ వివక్షకు గురిచేస్తూనే ఉంది. అందుకే అనాదిగా ఆడ పిల్లలను కడుపులోనే కాలరాస్తున్నారు. ఆలోచనలో మార్పురాకుంటే రేపటి అమ్మ కరువవుతుంది. కాలాలు మారుతున్నా.. సాంకేతిక అభివృద్ధి చెందుతున్నా..

Girl Child: చేతులెలా వచ్చాయమ్మా..? ఆడపిల్ల పుట్టిందనీ 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపిన తల్లి
Woman Slits Throat Of Infant
Follow us on

న్యూఢిల్లీ, జులై 28: ఆడిపిల్లంటే అందరికీ అలుసే. కనడానికి అమ్మకు బరువు. పెంచడానికి నాన్నకు బెదురు. కొడుకుతో సమానంగా చూసేందుకు ఏ ఒక్కరికీ మనసేరాదు. ఆడశిశువును ఓ చీడ పరుగులా, కట్టుబానిసగా భారత సమాజం నేటికీ వివక్షకు గురిచేస్తూనే ఉంది. అందుకే అనాదిగా ఆడ పిల్లలను కడుపులోనే కాలరాస్తున్నారు. ఆలోచనలో మార్పురాకుంటే రేపటి అమ్మ కరువవుతుంది. కాలాలు మారుతున్నా.. సాంకేతిక అభివృద్ధి చెందుతున్నా.. ఆడ బిడ్డల పట్ల ఈ వివక్ష రోజురోజుకూ జడలు విప్పుకుని వికృతరూపం దాల్చుతుందేతప్ప మార్పు కానరావడం లేదు. తాజాగా ఓ తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టింది ఆడపిల్లని తెలుసుకుని, తన చేతులతోనే దారుణానికి ఒడిగట్టింది. కళ్లు కూడా తెరవని 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి అమానుషంగా చంపింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని ముండ్కాలోని తిక్రీ సమీపంలోని బాబా హరిదాస్ కాలనీలో గురువారం (జులై 26)జరిగింది. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) (ఔటర్) జిమ్మీ చిరామ్ మాట్లాడుతూ..

దేశ రాజధాని ఢిల్లీలో ఔటర్ ఢిల్లీ ముండ్కా ప్రాంతంలోని బాబా హరిదాస్ కాలనీలో నివసిస్తున్న 22 ఏళ్ల మహిళ తొమ్మిది రోజుల కిందట ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టంలేక కత్తితో బిడ్డ గొంతుకోసి హతమార్చింది. ఇది తెలిసి ఆ మహిళ భర్త గోవింద్ సాహ్ని ముండ్కా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకోగా.. రెండో అంతస్తులోని ఒక గదిలో పసికందు మృతి చెంది కనిపించగా.. మరో గదిలో తల్లి ఉండటాన్ని గమనించారు. మహిళను అరెస్ట్ చేసి విచారించగా.. తనకు ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదని, అందుకే చంపేశానని పోలీసులకు చెప్పింది.

ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు వాడిన కత్తిని ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా మహిన భర్త గోవింద్‌ బహదూర్‌గఢ్‌లోని షూ తయారీ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. హత్యకు గురైన శిశువు వారి రెండో సంతానం. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తు అధికారులు మహిళ గుర్తింపును వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.