PM Modi: ఈనెల 25 నుంచి మోదీ ఎన్నికల శంఖారావం.. 150 సభలు, లెక్కలేనన్ని రోడ్‌ షోలు

మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ చూస్తుంటే రఫ్పాడించాలని ఫిక్సయినట్లున్నారు. ఈనెల చివర్న ప్రధాని మోదీ కాళ్లకు చక్రాలు కట్టుకోని ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. మోదీ దేశవ్యాప్త ఎన్నికల ప్రచార షెడ్యూల్‌.. ప్రతిపక్షాల్లో వణుకు పుట్టించేలా ఉంది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

PM Modi: ఈనెల 25 నుంచి మోదీ ఎన్నికల శంఖారావం.. 150 సభలు, లెక్కలేనన్ని రోడ్‌ షోలు
PM Narendra Modi

Updated on: Mar 08, 2024 | 6:40 PM

నేషనల్ అయినా, ఇంటర్నేషనల్‌ అయినా టూర్ల మొదలుపెడితే నాకంటే ఎవరు బాగా తిరగలేరు అనంటున్నారు ప్రధాని మోదీ. వరుస మీటింగులతో మీకు అలసటొస్తుందేమో… నాకు ఊపొస్తుందంటున్నారు. మరేంటి 150 సభలు, లెక్కలేనన్ని రోడ్‌ షోలూ, వందల కొద్దీ స్పీచ్‌లతో మరోసారి పీటమెక్కేందుకు… దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ని ఫిక్స్‌ చేశారు ప్రధాని మోదీ. మీటింగుల లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకుంటున్నారు.

ఈనెల 25 నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు ప్రధాని మోదీ. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మీటింగులు నిర్వహించేలా ప్లాన్‌ చేశారు. రోజుకు రెండు మీటింగులు ఉండేలా చూసుకుంటున్నారు. రోడ్‌ షోలకు సైతం పకడ్భందీ ప్రణాళికలు సిద్దం చేశారు. దేశవ్యాప్తంగా 150 ప్రచార సభలు ఉండగా… కేవలం దక్షిణ భారతంలోనే 35 నుంచి 40 సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. యూపీలో 15 కంటే ఎక్కువ సభల్లో పాల్గొంటారు. అస్సాంలో 2, మధ్యప్రదేశ్‌లో 3 సభల్లో పాల్గొని ప్రతిపక్షాల తీరును ఎండగట్టనున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే… 5 ఏళ్ల విజన్‌ ఎలా ఉండబోతోందో ప్రజల కళ్ల ముందుంచనున్నారు మోదీ.

ప్రతి ఒక్క మీటింగ్‌ సక్సెస్‌ అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్లేస్‌ని బట్టి, సిచ్యువేషన్‌ని బట్టి నేతలను వెంట తీసుకెళ్లనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు మ్యాగ్జిమమ్‌ ప్రధాని ప్రతీ మీటింగ్‌కు హాజరుకానున్నారు. ప్రసంగాలు సైతం షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రత్యర్ధులపై పంచ్‌లు సైతం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా… హోలీ పండుగ తర్వాత మోదీ ఎన్నికల ప్రచార పండుగను షురూ చేయనున్నారు. గెలుపే లక్షంగా దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. మరి షెడ్యూలే ఈ రేంజ్‌లో ఉంటే ఇక సభలు ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..