UNESCO: యునెస్కో జాబితాలో మరో రెండు చారిత్రక కట్టడాలు.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

|

Sep 19, 2023 | 8:40 AM

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న శాంతినికేతన్‌ను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చుతూ ఆదివారం యునెస్కో ప్రకటన చేసింది. అయితే తర్వాతి రోజైన సోమవారం మరో కట్టడాన్ని చేర్చుతున్నట్లు ప్రకటించడం విశేషం. కర్ణాటకలోని హోయసల ఆయలం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చినట్లు యునెస్కో ప్రకటించింది. ది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్...

UNESCO: యునెస్కో జాబితాలో మరో రెండు చారిత్రక కట్టడాలు.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
UNESCO
Follow us on

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్‌కు చెందిన మరో రెండు చారిత్రక కట్టడాలు చోటు దక్కించుకున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు కట్టడాలు యూనెస్కో జాబితాలో స్థానం సంపాదించుకోవడం విశేషం. రెండు రోజుల్లో రెండు కట్టడాలు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న శాంతినికేతన్‌ను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చుతూ ఆదివారం యునెస్కో ప్రకటన చేసింది. అయితే తర్వాతి రోజైన సోమవారం మరో కట్టడాన్ని చేర్చుతున్నట్లు ప్రకటించడం విశేషం. కర్ణాటకలోని హోయసల ఆయలం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చినట్లు యునెస్కో ప్రకటించింది. ది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ – యునెస్కో ఈ విషయాన్ని ప్రకటించింది.

ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రపంచ వారసత్వ జాబితాలో భారత్‌కు చెందిన కట్టడాల సంఖ్య 42కి చేరాయి. ఇదిలా ఉంటే హోయసలలోని పవిత్ర ఆలయాలు 2014 ఏప్రిల్‌ 15 వ తేదీ నుంచే యునెస్కో పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ హోయసల ఆలయాల పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) నిర్వర్తిస్తోంది.

ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తూ యునెస్కో తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యతిరేకం చేశారు. ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ ఆలయానికి చోటు దక్కడం.. భారత్‌కు ఎంతో గర్వ కారణమని ప్రధాని ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఆలయాలపై చెక్కిన సమాచారం, అద్భుతమైన శిల్ప కళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళా నైపుణ్యానికి నిదర్శమని ప్రధాని పేర్కొన్నారు.

ఇక ప్రపంచ వారసత్వ జాబితాలో హోయసల ఆలయం చోటు దక్కించుకోవడంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి స్పందించారు. రెండు రోజుల్లో రెండు కట్టడాలు యూనెస్కో జాబితాలో చేరడం సంతోషకరమని ట్వీట్ చేశారు. హోయసల ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో 42వ స్థానంలో నిలిచిందని, బేలూర్‌, హళేబీడ్‌, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ పునర్జీవనానికి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ఫలితమే ఇదంతా అంటూ కిషన్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..