Telugu News India News Monsoon Session 2022: Congress and TRS MPS protest in front of the Mahatma Gandhi statue in Parliament
Monsoon Session: జీఎస్టీ పెంపుకి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎంపీలు ధర్నా.. రేవంత్ రెడ్డి దూరం
ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దూరంగా ఉండడం విశేషం..
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. నిత్యావసరాలపై జీఎస్టీరేట్ల పెంపు, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం సమస్యలపై ప్రతిపక్షాలు గళం విప్పాయి. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట ప్రతిపక్ష నేతలు ధర్నా చేశారు. జీఎస్టీ పెంపు వ్యతిరేకిస్తూ ఆందోళన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే , అధిర్ రంజన్ చౌదరి సహా పలువురు టిఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు.
Delhi | Congress MPs Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury join the Joint Opposition protest in front of the Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation, on the third day of the Monsoon session pic.twitter.com/z2OcRAILEv
ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దూరంగా ఉండడం విశేషం..
మరోవైపు ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నాం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మంత్రులు.. ప్రతి పక్ష నేతల ప్రశ్నలకు, విమర్శలకు తగిన సమాధానాలు సిద్ధం చేసుకోవాలని సూచించనున్నట్లు తెలుస్తోంది.