కోతుల బెడద రోజు రోజుకూ మరింత ఎక్కువవుతుంది. పల్లె పట్టణాలు అని లేకుండా విచ్చలవిడి కోతుల సంచారంతో జనజీవనం బెంబేలెత్తిపోతున్నారు. గుంపులు గుంపులుగా విహరిస్తున్న వానరాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కోతుల చేష్టలకు రైతులు, వ్యాపారులే కాదు సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులు, నష్టాలపాలవుతున్నారు. ఇప్పుడు కోతులు బెడద ఆస్పత్రి రోగులకు సైతం తప్పటం లేదు. నగరంలోని ఆసుపత్రుల్లో కూడా కోతుల దాడి మొదలైంది. జిల్లా ప్రభుత్వ ఆప్పత్రిలోకి ప్రవేశించిన వానరాలు రచ్చ రచ్చ చేశాయి.. లేబర్ రూమ్‌లోకి అకస్మాత్తుగా అనేక కోతులు ప్రవేశించి ఆస్పత్రి ఆవరణను కిష్కిందకాండగా మార్చేశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కోతుల అల్లరితో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. కోతుల దాడితో వెంటనే ప్రజలంతా అక్కడి నుండి పారిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వానరాలు బీభత్సం సృష్టించాయి.. తాజ్‌మహల్‌పైనే కాదు, ఇప్పుడు నగరంలోని ఆసుపత్రులపై కూడా కోతులు దాడి చేయడం ప్రారంభించాయి. జిల్లాలోని లేడీ లాయల్ ఉమెన్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లోని లేబర్ రూమ్‌లోకి అకస్మాత్తుగా అనేక కోతులు ప్రవేశించి ధ్వంసం చేయడం ప్రారంభించాయి. ఆసుపత్రిలోకి ప్రవేశించిన కోతులు దాదాపు 7 గంటల పాటు హల్‌చల్ చేశాయి. ఆస్పత్రిలోని వస్తువులు, సామాగ్రి మొత్తం చిందర వందరగా చేస్తూ… విధ్వంసం సృష్టించాయి. ఆస్పత్రిలో ప్రవేశించిన కోతులు చేసిన రచ్చకు సంబంధించిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలోని లేబర్ రూంలోకి కోతులు ప్రవేశించడంతో సీలింగ్ కూల్చివేశాయి. అనంతరం ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు కమాండ్ గంటల తరబడి శ్రమించి వాటిని బయటకు తరిమికొట్టారు.. అయితే కోతులను పూర్తిగా తరిమికొట్టేందుకు వారికి మొత్తం ఏడు గంటల సమయం పట్టింది. ఆసుపత్రి వెలుపల కోతుల గుంపు ఉంది. ఆస్పత్రిలో రోగులు, సహాయకులు ఏదైనా తిన్నా, త్రాగిన వెంటనే వారిపై దాడి చేసి వాటిని లాక్కునేందుకు ప్రయత్నించాయి. కోతులను తరిమికొట్టేందుకు ఆసుపత్రిలో లంగూర్ బొమ్మను ఉంచినా అవి దాన్ని లెక్క చేయకుండా రెచ్చిపోయి ప్రవర్తించాయి.
यूपी के आगरा में बंदरों का उत्पात कम होने का नाम नहीं ले रहा है। जिला महिला अस्पताल (लेडी लायल) का लेबर रूम बंदरों ने तबाह कर दिया। बंदर कमरे की फाल्स सीलिंग में घुस गए, करीब सात घंटे तक तांडव मचाया। इसका वीडियो भी वायरल हो रहा है।#monkeyattack #agra #videoviral #agrahospital pic.twitter.com/fpFblmFPZL
— Hindustan UP-Bihar (@HindustanUPBH) October 9, 2022
కోతులు బీభత్సం సృష్టించిన ఉదంతం ఇదొక్కటే కాదు, ఇంతకు ముందు కూడా అనేక ఉదంతాలు తెరపైకి వచ్చాయి. గత నెల సెప్టెంబరు 30న జిల్లాకు చెందిన డీఎం ఎస్కార్ట్ జీపులోకి ప్రవేశించి వేధించాయి.. కారులో ఉంచిన వస్తువులు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ విషయంలో కఠినంగా ఉండడానికి పాలకులు పలు మార్గాలను అవలంబిస్తున్నారు. కోతుల బెడద నుంచి కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి