బోడో ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని మోదీ. అసోం కోక్రాజర్‌లో బోడో శాంతి ఒప్పందం విజయోత్సవానికి హాజరైన ప్రధాని..అందరి సహకారంతోనే 50 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు..ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని..సీఏఏతో ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ..తనపై దాడికి వస్తే అనేక మంది తల్లులు కాపాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై తీవ్రస్థాయి ఆందోళనల తర్వాత..తొలిసారిగా అసోంకు వచ్చారు ప్రధాని. అసోం ప్రభుత్వం, బోడోలాండ్ ఉద్యమ సంఘాల మధ్య చారిత్రక శాంతి ఒప్పందంతో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అసోం సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.