అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌.. పాక్ మిస్సైల్‌ను గాల్లోనే ధ్వంసం చేసిన భారత్‌

ఆపరేషన్ సిందూర్ తర్వాత పంజాబ్‌లోని అనేక ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు, కొన్ని తెలియని పరికరాలు పడిపోయినట్లు నివేదికలు వచ్చాయి. బటిండాలోని అకాలియా గ్రామంలోని గోధుమ తోటలో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించిందని. ఒకరు మృతి చెందగా, ఐదు మంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి.  వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ ఒక యుద్ధ విమానం కూలిపోయిందని కూడా చెబుతున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు

అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌.. పాక్ మిస్సైల్‌ను గాల్లోనే ధ్వంసం చేసిన భారత్‌
Missile Parts

Updated on: May 08, 2025 | 12:47 PM

పంజాబ్‌ అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. అమృత్‌సర్‌ పరిసరాల్లో మిస్సైల్‌ శకలాలు లభ్యం కావటం ఇప్పుడు కలకలం రేపుతోది. అమృత్‌సర్‌పై మిస్సైల్‌ దాడికి పాక్‌ ప్రయత్నించినట్టుగా సమాచారం. కానీ, భారత బలగాలు పాక్‌ చర్యలను తిప్పికొట్టాయి. పాక్‌ ప్రయోగించిన మిస్సైల్‌ను గాల్లోనే ధ్వంసం చేసింది భారతసైన్యం. యాంటీ మిస్సైల్‌ వ్యవస్థ ద్వారా పాక్‌ దుశ్చార్యను భారత్‌ అడ్డుకుంది. ఈ క్రమంలోనే అమృత్‌సర్‌ పరిసరాల్లో కూలిపడిపోయిన మిస్సైల్‌ శకలాలను గుర్తించారు స్థానికులు.

ఈ క్షిపణి ముక్కలు అమృత్‌సర్‌లోని మూడు గ్రామాల్లో పడి ఉన్నాయి. అమృత్‌సర్ గ్రామీణ ఎస్‌ఎస్‌పి మణీందర్ సింగ్ దీనిని ధృవీకరించారు. వెంటనే సైన్యానికి సమాచారం అందించారు. దాంతో ఒక సైనిక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఈ క్షిపణులను తమతో తీసుకెళ్లింది. దుధాల, జేతువాల్, పంధేర్ గ్రామాలలో క్షిపణి శకలాలు లభించాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రంతా అమృత్‌సర్‌ను చీకటి కమ్ముకుంది. మరోవైపు, పంజాబ్ పోలీసు అధికారులు, ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ ఉద్రిక్తతల నడుమ క్షణ క్షణం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది అధికార యంత్రాంగం.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ సిందూర్ తర్వాత పంజాబ్‌లోని అనేక ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు, కొన్ని తెలియని పరికరాలు పడిపోయినట్లు నివేదికలు వచ్చాయి. బటిండాలోని అకాలియా గ్రామంలోని గోధుమ తోటలో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించిందని. ఒకరు మృతి చెందగా, ఐదు మంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి.  వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ ఒక యుద్ధ విమానం కూలిపోయిందని కూడా చెబుతున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంగళవారం రాత్రి, తల్వారాలోని హాజీపూర్ బ్లాక్‌లోని ఘగ్వాల్ గ్రామంలోని ఒక ఇంటి ప్రాంగణంలో గీజర్ ఆకారంలో ఉన్న పరికరం పడిపోయింది. దాని నుండి అనేక వైర్లు బయటకు వచ్చాయి. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో, ఘగ్వాల్ నివాసి అశోక్ కుమార్ ప్రాంగణంలో ఆకాశం నుండి ఒక గుర్తు తెలియని పరికరం పడిపోయింది. దాంతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఆ వింత ఆకారంలో ఉన్న వస్తువు పడిపోయినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. అకస్మాత్తుగా వచ్చిన శబ్దం విని, అశోక్ కుటుంబ సభ్యులే కాకుండా, చుట్టుపక్కల ఇళ్లలోని వారు కూడా నిద్రలోంచి మేల్కొన్నారని చెప్పారు. వెంటనే హాజీపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వస్తువుపై ఒక సీరియల్ నంబర్, దానిపై “టెస్ట్ పోర్ట్ సీకర్” అని ఇంగ్లీషులో రాసి ఉందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..