
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: గిరిజన భాషల కోసం దేశంలోనే తొలిసారి AI-ఆధారిత ట్రాన్స్‌లేషన్ యాప్ ‘ఆది వాణి’ బీటా వెర్షన్‌ను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం (సెప్టెంబర్ 1) ప్రారంభించింది. జాతీయ గౌరవ్ వర్ష్ (JJGV) వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభు నాయర్, IIT ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనంత్ ప్రకాష్ పాండే, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మసిర్కర్, IIT ఢిల్లీ BBMC సెల్ ప్రొఫెసర్ వివేక్ కుమార్, IIT ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో అన్ని రాష్ట్రాల గిరిజన పరిశోధన సంస్థలు (TRIలు), గిరిజన భాషలకు చెందిన ప్రముఖ నిపుణులు సైతం పాల్గొన్నారు. గిరిజనుల సాధికారతకు ఇదొక మైలురాయిగా ఈ సందర్భంగా గిరిజన మంత్రిత్వశాఖ అభివర్ణించింది. భాష సాంస్కృతిక గుర్తింపుకు పునాదని, సమాజాలను అనుసంధానించడంలో ఆది వాణి కీలక పాత్ర పోషించనుందని తెలిపింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కమ్యూనికేషన్ అంతరాలను తగ్గించడానికి, గిరిజన యువతను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి ఆది వాని సేవలను అందించనుంది.
రాష్ట్ర గిరిజన పరిశోధనా సంస్థలు (TRIలు) సేకరించిన ప్రామాణిక భాషా డేటాతో ఆది వాణి ట్రాన్స్‌లేషన్ యాప్ అత్యాధునిక సాంకేతికతను అనుసంధానిస్తుందని, సమాజ భాగస్వామ్యం ద్వారా నిరంతర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఫీడ్‌బ్యాక్ వ్యవస్థతో రూపొందించినట్లు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభు నాయర్ పేర్కొన్నారు. గిరిజనలు జీవితంపై అర్థవంతమైన ప్రభావాన్ని చూపుతూ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలను సంరక్షించడానికి కృత్రిమ మేధస్సును ఎలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చో ఆది వాణి ప్రతిబింబిస్తుందని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ అన్నారు. భాషను కోల్పోతే.. అది సంస్కృతి, వారసత్వం క్షీణతకు దారితీస్తుందని జాయింట్ సెక్రటరీ అనంత్ ప్రకాష్ పాండే అన్నారు. ఆది వాణి అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు TRIలు, ప్రముఖ సాంకేతిక సంస్థల ద్వారా చేస్తున్న సహకార ప్రయత్నాల ఫలితమన్నారు. ఇది గిరిజన భాషలను సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి తక్కువ ఖర్చుతో కూడిన ప్రభావవంతమైన పరిష్కార మార్గమని ఆయన అన్నారు.
ఆది వాణి అనేది కేవలం AI ఆధారిత ట్రాన్స్‌లేషన్ యాప్ మాత్రమే కాదు. కమ్యూనిటీలను అనుసంధానించడానికి, సాంస్కృతిక గుర్తింపును కాపాడటానికి ఇదొక వేదిక కూడా. ఇది అంతరించిపోతున్న భాషల డిజిటలైజేషన్‌కు మద్దతు ఇస్తుంది. స్థానిక భాషలలో విద్య, ఆరోగ్య సంరక్షణ, పాలనను మెరుగుపరచడం, గిరిజన వ్యవస్థాపకతను సులభతరం చేయడం వంటివి చేస్తుంది. రీసెర్చర్‌లకు నాలెడ్జ్ హబ్‌గా ఇది ఉపయోగపడుతుంది. దీనిని BITS పిలానీ, IIIT హైదరాబాద్, IIIT నవ రాయ్‌పూర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో IIT ఢిల్లీ నేతృత్వంలోని జాతీయ కన్సార్టియం అభివృద్ధి చేసింది. ఆది వాణి – AI సాధనం వెబ్ పోర్టల్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ బీటా వెర్షన్ త్వరలో ప్లే స్టోర్, iOSలోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్‌లో సంతాలి (ఒడిశా), భిలి (మధ్యప్రదేశ్), ముండారి (జార్ఖండ్), గోండి (ఛత్తీస్‌గఢ్), కుయ్, గారో వంటి గిరిజన భాషలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
హిందీ, ఇంగ్లీష్, గిరిజన భాషల మధ్య అనువాదం చేయడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ప్రారంభ అభ్యాసకుల కోసం ఇంటరాక్టివ్ భాషా అభ్యాస మాడ్యూల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. జానపద కథలు, మౌఖిక సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం వంటివి డిజిటలైజేషన్ చేస్తారు. గిరిజన భాషలలో ఆరోగ్య సమాచారం, ప్రధానమంత్రి ప్రసంగాలతో సహా పలు ప్రభుత్వ సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. స్థానిక భాషలలో విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వివరాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. గిరిజన భాషా వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా.. ఆది వాణి డిజిటల్ ఇండియా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, పీఎం జన్‌మాన్, ఆది కర్మయోగి అభియాన్, ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అనుసంధానం కానున్నాయి. ముఖ్యంగా 2047 నాటికి సమ్మిళిత, జ్ఞాన-ఆధారిత విక్సిత్ భారత్‌ను నిర్మించడంలో 20 లక్షలకు పైగా ట్రైబర్ ఛేంజ్ లీడర్లకు
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ అప్లికేషన్‌ను రూపొందించామని, ఇప్పటివరకు “ఖచ్చితత్వ అవసరాల కంటే ఎక్కువగా” ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆది కర్మయోగి యాప్ ద్వారా దేశంలోని 550 జిల్లాల్లోని లక్ష మంది గిరిజన గ్రామాలలో సుమారు 20 లక్షల మంది స్వచ్ఛంద సేవకులు, గ్రామ అధికారులు వంటి ట్రైబర్ ఛేంజ్ లీడర్లకు సామర్థ్య నిర్మాణాన్ని అందించడం గిరిజన మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆది వాణి యాప్ వినియోగంపై ఆది కర్మయోగి పోర్టల్‌లపై ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.