‘ఉదయాన్నే మద్యం సేవించేవారిని తాగుబోతులుగా ముద్రవేస్తే సహించేది లేదు..’: మంత్రి

|

Jul 18, 2023 | 1:56 PM

రాష్ట్ర ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ మంత్రి ముత్తుసామి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయం పూట మద్యం సేవించే వారి గురించి హీనంగా మాట్లాడితే సహించేదిలేదన్నారు. అటువంటి వారిని తాగుబోతులుగా ముద్ర వేయరాదన్నారు. పొద్దున్నే మద్యం తాగేవాళ్ల..

ఉదయాన్నే మద్యం సేవించేవారిని తాగుబోతులుగా ముద్రవేస్తే సహించేది లేదు..: మంత్రి
Minister Muthusamy
Follow us on

చెన్నై, జులై 18: రాష్ట్ర ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ మంత్రి ముత్తుసామి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయం పూట మద్యం సేవించే వారి గురించి హీనంగా మాట్లాడితే సహించేదిలేదన్నారు. అటువంటి వారిని తాగుబోతులుగా ముద్ర వేయరాదన్నారు. పొద్దున్నే మద్యం తాగేవాళ్ల సంగతి వేరేగా ఉంటుంది. కష్టపడి పనిచేయని సోమరులు కూడా మద్యం తాగుతున్నారు. దీన్ని నివారించలేం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటూ ముత్తుస్వామి వ్యాఖ్యానించారు. ముత్తుస్వామి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు పెంచడంపై దృష్టి సారించకుండా పారిశుధ్య కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు మద్యం అమ్మకుండా చేత్తో చెత్తను తొలగించడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనాలని అన్నామలై అన్నారు. గత ఐదేళ్లలో 56 మంది పారిశుధ్య కార్మికులు విధుల్లో మరణించారని, ఇప్పుడు ఉదయం వేళల్లో మద్యం సేవించి వారు మాన్యువల్‌గా వ్యర్థాలను పారవేయాలా? అంటూ ఆయన ప్రశ్నించారు.

కాగా మంత్రి ముత్తుసామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రెండో సారి. గతంలో కూడా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య విధులకు వెళ్లే వారికి మద్యం అమ్మడంపై చర్చ జరగాలన్నారు. తమిళనాడు మాజీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాల అనంతరం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్‌ తర్వాత ఆయన్ని పుఝల్ జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.