యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధం… అయితే ఓ షరతు.. అసదుద్దీన్ ఒవైసీ

| Edited By: Phani CH

Jul 24, 2021 | 9:16 PM

యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధం... అయితే ఓ షరతు.. అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi
Follow us on

యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ముస్లిం ని ఎంపిక చేయాలని ఆయన షరతు పెట్టారు. ఇప్పటికే ఒవైసీ పార్టీ..ఓంప్రకాష్ రాజ్ భర్ ఆధ్వర్యంలోని భగీదారీ సంకల్ప్ మోర్చా అనే పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. ఈ మోర్చా మరికొన్ని చిన్న పార్టీల కూటమి. దేశ వ్యాప్తంగా ఆ యా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి పదవులను ముస్లిములకు కేటాయించాలని ఎంఐఎం నేత అసీం వకర్ ఇటీవల డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ దీనిపై తమ వైఖరులను స్పష్టం చేయాలన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఈ మేరకు తమకు హామీ ఇస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని అంటున్నారు. భగీదారీ సంకల్ప్ మోర్చా ఇందుకు సుముఖంగానే ఉందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

చిన్న పార్టీలతో తాము చేతులు కలుపుతామని అఖిలేష్ యాదవ్ ఈ మధ్యే ప్రకటించారు. భావ సారూప్య పార్టీలను తాము ఆహ్వానిస్తామన్నారు. అయితే ఆయన పార్టీపై బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. దళిత వ్యతిరేకి ఆయన ఆ పార్టీ చిన్నా చితకా పార్టీల పొత్తును కోరుతోందని, నిస్సహాయ స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. సమాజ్ వాదీ వైఖరి కారణంగా అన్ని పెద్ద పార్టీలూ దానికి దూరమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అటు 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ 289 సీట్లు గెలుచుకోవచ్చునని ఐఏఎన్ఎస్ సి-ఓటర్ టాకర్ అంచనా వేసింది. సమాజ్ వాదీ పార్టీ 59 స్థానాలను, బహుజన్ సమాజ్ పార్టీ 38 సీట్లను గెలుచుకుంటాయని పేర్కొంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Health Tips : ఆల్కహాల్‌తో ఈ 5 ఆహార పదార్థాలు అస్సలు తినవద్దు..! చాలా డేంజర్..

శుంభ, నిశుంభ రాక్షసులను వధించి పార్వతి దేవి చండిగా వెలసిన క్షేత్రం