Viral News: భారీ పాల ట్యాంకర్‌ బోల్తా.. బిందెలతో, బ‌కెట్ల‌తో జనం!… ఎటు వెళ్తుందో ఈ స‌మాజం

|

May 28, 2021 | 10:27 PM

క‌రోనా వ‌చ్చి.. మ‌నుషుల‌కు చాలా పాఠాలు నేర్పించిందని ఇప్ప‌టివ‌ర‌కు భావించాం. కానీ కొన్ని.. కొన్ని క్వాలిటీస్ వారిని వీడి వెళ్ల‌డం లేదు అన‌డానికి ఈ ఘ‌ట‌న‌ను ఒక ఉదాహార‌ణ‌గా చెప్పొచ్చు.

Viral News: భారీ పాల ట్యాంకర్‌ బోల్తా.. బిందెలతో, బ‌కెట్ల‌తో జనం!... ఎటు వెళ్తుందో ఈ స‌మాజం
Milk Tanker Accident
Follow us on

క‌రోనా వ‌చ్చి.. మ‌నుషుల‌కు చాలా పాఠాలు నేర్పించిందని ఇప్ప‌టివ‌ర‌కు భావించాం. కానీ కొన్ని.. కొన్ని క్వాలిటీస్ వారిని వీడి వెళ్ల‌డం లేదు అన‌డానికి ఈ ఘ‌ట‌న‌ను ఒక ఉదాహార‌ణ‌గా చెప్పొచ్చు. రాజస్థాన్‌లోని విరాట్‌నగర్‌ భబారు గ్రామం వద్ద భారీ పాల ట్యాంకర్ ప్ర‌మ‌ద‌వ‌శాత్తూ బోల్తా పడింది. దీంతో ట్యాంక‌ర్ లోని పాలు పెద్ద ఎత్తున రోడ్డుపై ఒలికిపోయి.. ప్ర‌వహించాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ప్ర‌మాదం జ‌రిగింది.. పాపం ఎవ‌రికైనా.. ఏమైనా అయిందా అనే విష‌యం ప‌ట్టించుకోకుండా.. అక్కడికి ఏకంగా బిందెలు, బకెట్లతో వ‌చ్చి పాలు తీసుకెళ్లారు. భిల్వారా పాల ఉత్పత్తిదారుల సహకార సొసైటీకి చెందిన ఈ పాల ట్యాంకర్‌ ఉదయం భిల్వారా నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్తోంది. ఈ నేపథ్యంలో ట్యాంకర్‌ నియంత్రణ కోల్పోయి.. అదుపుత‌ప్పి జయపుర -దిల్లీ రహదారిపై బోల్తా పడింది. ట్యాంకర్‌ పగలడంతో హైవే వెంట ఉన్న కాల్వలో పెద్ద ఎత్తున పాలు ప్రవహించాయి. ఈ ఘటనలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడినట్టు పోలీసులు వెల్ల‌డించారు.

చిత్తూరు జిల్లాలో కోళ్ల లారీకి యాక్సిడెంట్.. మ‌నుషులు చ‌నిపోయినా ప‌ట్టించుకోకుండా…

చిత్తూరు జిల్లా బాకరావుపేట ఘాట్‌రోడ్డులో ఓ కోళ్లలారి యాక్సిడెంట్‌కు గురైంది. బ్రాయిలర్‌ కోళ్లతో వెళుతున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోళ్ల లారీ డ్రైవర్‌, కారులో ఉన్న సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే యాక్సిడెంట్ జ‌రిగి మృత‌దేహాలు అక్క‌డ చిక్కుకుని ఉంటే.. గాయ‌ప‌డ్డవారు బాధ‌లో ఉంటే.. క‌నీస మాన‌వీయ విలువ‌లు లేకుండా స్థానికులు లూఠీకి పాల్పడ్డారు. యాక్సిడెంట్‌కు గురైన కోళ్ల లారీ నుంచి.. కోళ్లను ఎత్తుకుపోయారు. లారీ పల్టీ కొట్టడంతో కోళ్లన్నీ జాలీలతో సహా చిందరవందరగా పడిపోయాయి. ఇదే అదనుగా భావించిన స్థానికులు కోళ్లను లూఠీ చేశారు. లారీ, కారులో శవాలు ఉండగానే కోళ్లన్నీ మాయం చేశారు.

Also Read: బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ

ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా…? ఇదిగో క్లారిటీ