
Farmers Tractor Rally: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన నేపధ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సింఘూ, ఘాజీపూర్, తిక్రి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా బంద్ చేసింది. సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 కింద దీనిని అమలు చేస్తున్నామని.. జనవరి 29 ఉదయం 11 గంటల నుంచి జనవరి 31 వరకు ఈ నిలుపుదల వర్తిస్తుందని చెప్పింది. కాగా, జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్స్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనితో అప్పటి నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేసిన సంగతి తెలిసిందే.