
గత ఏడాది మార్చి 6న కోచిలోని INS గరుడాలో మొదటి స్క్వాడ్రన్ INAS 334ను చేర్చిన నావికాదళం, ఇప్పుడు 2వ స్క్వాడ్రన్‌తో తన నేవల్ ఏవియేషన్ విభాగాన్ని మరింత శక్తివంతం చేస్తోంది. అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన ఈ అత్యాధునిక హెలికాప్టర్లు భారత నావికాదళానికి ‘గేమ్ ఛేంజర్’గా చెప్పవచ్చు.
MH-60R ‘రోమియో’ విశిష్టతలు, ప్రత్యేకతలు
MH-60R సీహాక్ హెలికాప్టర్ ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్‌డ్ మల్టీ-మిషన్ మారిటైమ్ హెలికాప్టర్‌గా పేరొందింది. ఇది యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ASW), యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్ (ASuW), సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR), మెడికల్ ఎవాక్యుయేషన్, వెర్టికల్ రీసప్లై వంటి అనేక పాత్రలు పోషించగలదు.
ప్రధాన ప్రత్యేకతలు:
భారతదేశానికి ఎంత మేర ఉపయోగం?
భారత్ 2020లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం 24 MH-60R హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. ఇవి పాత Sea King హెలికాప్టర్ల స్థానంలో వచ్చాయి. వీటి చేరికతో భారత నావికాదళం బ్లూ-వాటర్ నేవీగా మారడం వేగవంతమవుతుంది. అంటే విస్తృత సముద్ర ప్రాంతాల్లో సుదీర్ఘకాలం ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యం పెరుగుతుంది. వీటి వల్ల సముద్ర మార్గాల భద్రత, వాణిజ్య నౌకాయానం రక్షణతో పాటు ఉగ్రవాదం, సముద్రపు దొంగలు (సీ పైరేట్స్) దాడులు జరిపినప్పుడు వెనువెంటనే స్పందించేందుకు వెసులుబాటు కలుగుతుంది.
హిందూ మహాసముద్రంలో చైనా కార్యాకలాపాల నేపథ్యంలో కీలక పాత్ర
హిందూ మహాసముద్ర ప్రాంతం (IOR) భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం ఇక్కడి సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. అయితే గత కొన్నేళ్లుగా చైనా ఈ ప్రాంతంలో తన సైనిక ఉనికిని గణనీయంగా పెంచుతోంది. వివిధ ప్రాంతాల్లో బేస్‌లు ఏర్పాటు చేసుకోవడం, ‘స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్’ వ్యూహం ద్వారా ఓడరేవుల నిర్మాణం, సబ్‌మెరైన్లను మొహరించడం వంటి సైనిక కార్యాకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో MH-60R హెలికాప్టర్లు భారత రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఇవి సబ్‌మెరైన్‌లను గుర్తించి, ధ్వంసం చేయడంలో అత్యంత సమర్థవంతమైనవి. చైనా సబ్‌మెరైన్‌ల బెదిరింపును ప్రతిఘటించడంలో ఈ ‘రోమియో’లు ఫోర్స్ మల్టిప్లయర్‌గా పనిచేస్తాయి. రెండు స్క్వాడ్రన్లతో భారత నావికాదళం తూర్పు, పశ్చిమ తీరాల్లో సమగ్ర నిఘా, రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది.
ఈ రోమియో హెలీకాప్టర్ల స్క్వాడ్రన్ చేరికతో హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యం మరింత బలోపేతమవుతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సైనిక శక్తి పెరగడం వల్ల ప్రాంతీయ స్థిరత్వం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా రోమియో హెలీకాప్టర్ల 2వ స్క్వాడ్రన్ భారత రక్షణ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.