MGNREGA Works: కరోనా మహమ్మారి రెండో వేవ్ అన్ని రంగాలనూ దెబ్బతీసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజు కూలి మీద ఆధారపడి జీవించే వారికి ఉపాధి దొరకడం కష్టంగా మారిపోయింది. దానికి తోడు నగరాల నుంచి స్వంత ఊర్లకు చేరుకున్న వారికి ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి కేంద్ర ప్రభుత్వం వారికి ఆసరగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ -19 కేసులు పెరిగిన నేపథ్యంలో, ఈ ఏడాది మే నెలలో 1.85 కోట్ల మందికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని ఇస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
“కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ తో గ్రామీణ భారతదేశం దెబ్బతిన్నప్పటికీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులను ప్రభావితం చేయకుండా చూసుకుంది” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, మే 2021 లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద 1.85 కోట్ల మందికి పని కల్పించారు. 2019 మేలో ఇదే కాలంలో అందించిన పని కంటే 52% ఎక్కువ, ఇది రోజుకు 1.22 కోట్ల మందికి ఉపాధి చూపించింది అని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
“2021 మే 13 నాటికి, 2.21 కోట్ల మందికి 5.218 లక్షల రూపాయల పనులు ఈ పథకం కింద ప్రభుత్వం అనిదించింది. 34.56 కోట్ల రోజుల పనిని 2021-22 ఆర్థిక సంవత్సరంలో చూపించింది ప్రభుత్వం. “ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సహా అన్ని స్థాయిలలోని ఆపరేటింగ్ సిబ్బందిలో కరోనా కారణంగా ప్రాణనష్టం ఉన్నప్పటికీ ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులతో ప్రజలకు ఆసరాగా నిలిచింది.
దేశంలో కరోనా మహమ్మారి గణాంకాలు (May 17 నాటికి)