మేఘనా గిమిరే దృఢ సంకల్పం ముందు ఓడిన వైకల్యం

| Edited By: Phani CH

Jun 04, 2021 | 4:24 PM

ఆమె దృఢ సంకల్పం ముందు వైకల్యం తలవంచింది. ఆమె పట్టుదలకు సలాం కొట్టింది. ఆమె ఆశయానికి జీ హుజూర్‌ అంది..

మేఘనా గిమిరే దృఢ సంకల్పం ముందు ఓడిన వైకల్యం
Megha Ghimire
Follow us on

ఆమె దృఢ సంకల్పం ముందు వైకల్యం తలవంచింది. ఆమె పట్టుదలకు సలాం కొట్టింది. ఆమె ఆశయానికి జీ హుజూర్‌ అంది.. టిక్‌టాకర్‌ మేఘనా గిమిరే చాలా మందికి తెలిసే ఉంటుంది.. ఆమె ఎప్పుడూ గతాన్ని తల్చుకుని బాధపడలేదు. భవిష్యత్తుకు బంగారు బాటలు ఎలా వేసుకోవాలన్న ఆలోచనలే చేశారు.. ఇప్పుడామె జీవితంలో ప్రతి ఘట్టాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు.

కరెంట్‌ షాక్‌తో రెండు చేతులు కోల్పోయినా మేఘనా కుంగిపోలేదు.. బాధపడలేదు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఏమీ చేయలేని అసమర్థ జీవులకు ఆమె జీవితం ఓ పాఠం. నేపాల్‌కు చెందిన మేఘనా గిమిరే జీవితంలో కొంత భాగం మాత్రమే విషాదభరితం.. మిగతా జీవితాన్ని ఆమె సుఖమయం చేసుకున్నారు. కొన్నాళ్ల కిందట ఆమె ఓవ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసకున్నారు. మొదట పెద్దలు నో చెప్పినా పట్టుబడి ఒప్పించారామె! పెళ్లయిన పది నెలలకే ఆమె ప్రమాదానికి గురయ్యారు. దగ్గరే ఉన్న హైటెన్షన్‌ వైరును తాకడంతో కరెంట్ షాక్‌కు గురయ్యారు. పైగా అప్పుడు చేతికి ఇనుప గాజులు వేసుకోవడం వల్ల చేతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. డాక్టర్లు సర్జరీ చేసి రెండు చేతులను తొలగించారు. భార్య దివ్యాంగురాలవ్వడంతో దుర్మార్గుడైన భర్త చెప్పాపెట్టకుండా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు.

పుట్టినిట్టించి చేరిన మేఘనాను ఆమె తల్లి అపురూపంగా చూసుకున్నారు. స్నానం చేయించడం దగ్గర్నుంచి దుస్తులు మార్చడం, అన్నం తినిపించడం అన్నీ అమ్మనే చేసేవారు. ఎంతైనా అమ్మ కదా! కొన్నాళ్ల తర్వాత మేఘనా సొంతంగా పనలు చేసుకోవడం మొదలు పెట్టారు. కాళ్ల సాయంతో పనులు చేయడం ప్రారంభించారు. ఓరోజు సరదాగా మొబైల్‌ను కాళ్లతో ఆపరేట్‌ చేస్తూ తన పాత టిక్‌టాక్‌ అకౌంట్‌ను తెరిచారు. సెల్ఫీ వీడియోలతో టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేయడం మొదలు పెట్టారు. వాటిల్లో ఆమె కనబరుస్తున్న ఆత్మ విశ్వాసానికి లక్షలాది మంది భేష్‌ అన్నారు. అతి తక్కువ సమయంలోనే మేఘన టిక్‌టాక్‌ వీడియోలు పాపులరయ్యాయి. ప్రస్తుతం టిక్​టాక్​లో ఆమెకు ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన దగ్గర టిక్​టాక్​ బ్యాన్​ కాకముందు ఇక్కడి నుంచి కూడా ఆమె వీడియోలకు మంచి స్పందన ఉండింది. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఆమెకు బోలెడంత అభిమానులు ఏర్పడ్డారు .. మేఘన స్టోరీ వారిని కదిలించింది. వారు ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. వారిచ్చిన డబ్బులతో మేఘన అమెరికా వెళ్లారు. అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రోస్తటిక్​ చేతుల్ని అమర్చుకున్నారు. అవి ఆమెకు ఎంతో కొంత ఊరటనిచ్చాయి. తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆమె చిరునవ్వే మనకు జీవన్‌టోన్‌ తాగినంత బలాన్ని ఇస్తాయి.. మేఘన సందేశాలు కూడా ఆలోచింపచేస్తాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Minister KTR: టిమ్స్‌ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన 150 ఐసీయూ బెడ్స్‌.. గచ్చిబౌలిలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

MS Dhoni: ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే.. ధోనీ రిటైర్మెంట్‌ గురించి కీలక విషయాలు చెప్పిన గైక్వాడ్..