ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో.. పార్టీ నుంచి వేటు

| Edited By: Pardhasaradhi Peri

Jul 24, 2019 | 9:07 AM

కర్నాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్‌పై వేటు పడింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో గైర్హాజరు కావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ ఆదేశించినా.. మహేష్ పట్టించుకోలేదు. దీంతో పార్టీ ఆదేశాలను ఆయన ఉల్లంఘించారని.. క్రమశిక్షణా చర్యల కింద తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు […]

ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో.. పార్టీ నుంచి వేటు
Follow us on

కర్నాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్‌పై వేటు పడింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో గైర్హాజరు కావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ ఆదేశించినా.. మహేష్ పట్టించుకోలేదు. దీంతో పార్టీ ఆదేశాలను ఆయన ఉల్లంఘించారని.. క్రమశిక్షణా చర్యల కింద తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు మాయావతి. అయితే మొదట బీఎస్పీ బలపరీక్షకు దూరంగా ఉంటుందని వార్తలు వచ్చినా.. అనంతరం సంకీర్ణ ప్రభుత్వానికి మద్ధతుగా ఓటు వేయనున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఓటింగ్‌కు ఎమ్మెల్యే మహేష్ దూరంగా ఉన్నారు.