
ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో 22 గోదాములు కాలిపోయిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. జాతీయ మీడియాల కథనాల ప్రకారం. సోమవారం ఉదయం భివండీలో ఉన్న రిచ్ ల్యాండ్ కాంపౌండ్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇవి కాస్తా చుట్టు పక్కల ఉన్న గోదాములలోకి వ్యాపించాయి. దీంతో అక్కడున్న సుమారు 22 గోదాములు ఈ మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది. మంటలు భారీగా ఎగిసి పడి పెద్దమొత్తంలో పొగలు వెలువడడంతో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. సుమారు నాలుగు నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గోదాములలో రసాయణాలు వంటివి ఉండటం వల్ల మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారింది. ఘటనా స్థలం నుంచి భారీగా వెలువడుతున్న పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం నెలకొంది.
VIDEO | Thane, Maharashtra: Fire engulfs warehouse complex in Richland Compound, Bhiwandi. Fire fighting efforts are on.#MaharashtraNews
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/RnxVKp96Ov
— Press Trust of India (@PTI_News) May 12, 2025
అయితే అక్కడ తగలబడిన గోదాములలో పెద్ద మొత్తంలో రసాయనాలు, ప్రింటింగ్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆరోగ్య సంబంధిత ప్రోటీన్ ఫుడ్ పౌడర్లు, సౌందర్య సాధనాలు, బట్టలు, బూట్లు, మండప అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుండగా.. ప్రాణ నష్టం ఏదైనా జరిగిందా అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..