AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. 22 గోదాములు దగ్ధం?

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భివండీలో ఉన్న రిచ్‌ ల్యాండ్ కాంపౌండ్ వద్ద మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో చుట్టుపక్కనున్న సుమార్ 22 గోదాములు పూర్తిగా మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ గోదాముల్లో పెద్ద మొత్తంలో రసాయనాలు, ప్రింటింగ్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్టు సమాచారం.

Maharashtra : మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. 22 గోదాములు దగ్ధం?
Fireaccident
Anand T
|

Updated on: May 12, 2025 | 11:25 AM

Share

ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో 22 గోదాములు కాలిపోయిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. జాతీయ మీడియాల కథనాల ప్రకారం. సోమవారం ఉదయం భివండీలో ఉన్న రిచ్‌ ల్యాండ్ కాంపౌండ్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇవి కాస్తా చుట్టు పక్కల ఉన్న గోదాములలోకి వ్యాపించాయి. దీంతో అక్కడున్న సుమారు 22 గోదాములు ఈ మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది. మంటలు భారీగా ఎగిసి పడి పెద్దమొత్తంలో పొగలు వెలువడడంతో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. సుమారు నాలుగు నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గోదాములలో రసాయణాలు వంటివి ఉండటం వల్ల మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారింది. ఘటనా స్థలం నుంచి భారీగా  వెలువడుతున్న పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం నెలకొంది.

అయితే అక్కడ తగలబడిన గోదాములలో పెద్ద మొత్తంలో రసాయనాలు, ప్రింటింగ్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆరోగ్య సంబంధిత ప్రోటీన్ ఫుడ్ పౌడర్లు, సౌందర్య సాధనాలు, బట్టలు, బూట్లు, మండప అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుండగా.. ప్రాణ నష్టం ఏదైనా జరిగిందా అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..