Aadhar Card: పెళ్లైందన్న కారణంతో భర్త ఆధార్‌ వివరాలను పొందడం కుదరదు.. హైకోర్ట్‌ సంచలన తీర్పు..

హుబ్లికి చెందిన ఒక మహిళ తన భర్త నుంచి విడిపోయింది. అయితే భరణం విషయంలో తలెత్తిన సమస్య కారణంగా భర్త ఆధార్‌ నెంబర్‌, ఎన్‌రోల్‌మెట్ వివరాలు, ఫోన్‌ నెంబర్‌ కావాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే విషయమై స్పందించిన న్యాయవాదులు ఇది వ్యక్తిగత గోప్యతను దెబ్బతిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ జంటకు 2005లో వివాహం జరగగా, ఒక కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయింది....

Aadhar Card: పెళ్లైందన్న కారణంతో భర్త ఆధార్‌ వివరాలను పొందడం కుదరదు.. హైకోర్ట్‌ సంచలన తీర్పు..
Marriage

Updated on: Nov 28, 2023 | 4:32 PM

చట్టబద్ధమైన చట్ట పరిధిలోని గోప్యత హక్కుల గురించి కర్నాటక హైకోర్ట్ సంచలన తీర్పు నిచ్చింది. వివాహం జరిగిందన్న కారణంతో ఒక మహిళ తన భర్త ఆధార్‌ డేటాను ఏకపక్షంగా యాక్సెస్ చేయడం కుదరదని కర్నాటక హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఆధార్‌ కార్డ్‌ హోల్డర్‌ గోప్యత హక్కును.. వివాహ బంధం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించదని, చట్టంలో నిర్ధేశించిన విధాంగానే గోప్యత చట్టం వర్తిస్తుందని ఎస్‌ సునీల్‌ దత్‌ యాదవ్‌, విజయ్‌ కుమార్‌ ఎ పాటిల్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వచ్చింది.? కోర్టు ఈ తీర్పు నివ్వడానికి గల కారణం ఏంటంటే..

హుబ్లికి చెందిన ఒక మహిళ తన భర్త నుంచి విడిపోయింది. అయితే భరణం విషయంలో తలెత్తిన సమస్య కారణంగా భర్త ఆధార్‌ నెంబర్‌, ఎన్‌రోల్‌మెట్ వివరాలు, ఫోన్‌ నెంబర్‌ కావాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే విషయమై స్పందించిన న్యాయవాదులు ఇది వ్యక్తిగత గోప్యతను దెబ్బతిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ జంటకు 2005లో వివాహం జరగగా, ఒక కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయింది.

సదరు మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఫ్యామిలీ కోర్ట్‌ ఆమెకు భరణంగా రూ. 10,000 అలాగే కుమార్తె కోసం అదనంగా రూ. 5000 అందించాలని తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే తన భర్త ఆచూకీ తెలియకపోవడం, అతను పరారీలో ఉన్నాడన్న కారణాన్ని చూపుతూ ఆమె కోర్టులో పిటిషన్‌ వేసింది. భర్త ఆధార్‌ కార్డ్ వివరాలను అందించాలని కోరిన పిటిషన్‌ను కోర్ట్ ఫిబ్రవరి 25, 2021లో తిరస్కరించింది. అయితే 2023లో ఆమెకు కాస్త ఉపశమనం లభించింది.. భర్తకు నోటీజు జారీ చేయాలని యూఐడీఏఐని సింగిల్‌ బెంచ్‌ కోర్టు ఆదేశించింది. భర్త వాదనలు వినిపించాలని, ఆపై ఆర్టీఐ చట్టం కింద భార్య దరఖాస్తును పునఃపరిశీలించాలని డివిజన్‌ బెంచ్‌ యూఐడీఏఐని ఆదేశించింది.

వివాహం అనేది జీవిత భాగస్వామి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుందని మహిళ వాదించింది. అయితే ఏదైనా విషయాన్ని బహిర్గతం చేసే ముందు వారి వాదననను సమర్పించే వ్యక్తి హక్కును బెంచ్‌ నొక్కి చెప్పింది. ఆధార్‌ కార్డ్‌ కలిగిన వ్యక్తి గోప్యత హక్కు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుందని, చట్టబద్ధంగా మినహాయింపు లేదని పేర్కొంది. వివాహ బంధం ఒక వ్యక్తి గోప్యత హక్కును తగ్గించదని కోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..