మణిపూర్ అల్లర్ల వెనుక చైనా హస్తం? .. మయన్మార్ నుంచి అక్రమంగా ఆయుధాల సరఫరా.. జవాన్ సహా నలుగురు అరెస్ట్
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంగళవారం ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలపై IRB జవాన్‌తో సహా నలుగురిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఇంటెలిజెన్స్ అధికారుల బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కేరాంగ్ అవాంగ్ లికాయ్, ఖోమిడోక్‌తో పాటు అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ.2.5 లక్షల నగదు, పలు మొబైల్ ఫోన్లు, రెండు కార్లతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

మన దేశాన్ని అస్థిర పరచాలని రోజు రోజుకీ నిప్పుల కుంపటిగా మార్చాలని చైనా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. మన దేశ సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చేస్తోన్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. ఇంకా చెప్పాలంటే భారత దేశం వైపు ప్రపంచం దేశాలు చూస్తోండడం చైనాకు కంటగింపుగా మారింది. దీంతో తనదైన కుట్రలు కుతంత్రాలతో నిత్యం భారత దేశాన్ని ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జరుగుతున్న హింస వెనుక విదేశీ శక్తులున్నాయనే అనుమానాలకు అధికారులకు అధరాలు దొరికినట్లు తెలుస్తోంది.
మణిపూర్ రాష్ట్రంలో గత 56 రోజులుగా కొనసాగుతున్న హింస ప్రతి ఒక్కరిలోనూ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా తిరుగుబాటు గ్రూపులకు ఎలా ఆయుధాలున్నాయని. ఇక్కడ చెలరేగిన హింసను.. ప్రేరేపించడం వెనుక చైనా ప్రమేయం ఉందని ఇప్పటికే అనుమానం వ్యక్తమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అనుమానాలన్నీ నిజమేనని..చైనా ఆయుధాలను స్మగ్లింగ్ చేసి మయన్మార్ మీదుగా మణిపూర్‌కు పంపినట్లు తెలుస్తోంది.
ఇండియా టుడే నివేదిక ప్రకారం.. మణిపూర్ లోని హింస వెనుక హస్తం.. ఉపయోగిస్తున్న ఆయుధాలపై నిఘా వర్గాల బృందం చేసిన దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మణిపూర్‌లో హింస చెలరేగి.. అశాంతిని నెలకొల్పడానికి పొరుగుదేశమైన చైనా.. మయన్మార్ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. చైనా నుంచి ఆయుధాలు ముందుగా మయన్మార్‌కు చేరుకుంది. అక్కడ నుంచి తిరుగుబాటు దారులు ఆయుధాలను సేకరించి మూడు వాహనాల్లో రాష్ట్రానికి తీసుకుని వచ్చారు. హింసలో వాటిని ఉపయోగించారని వెల్లడించారు.




నివేదిక ప్రకారం ఈ ఆయుధాలు మయన్మార్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న బ్లాక్ మార్కెట్ నుండి తీసుకురాబడ్డాయని తెలుస్తోంది. నిఘావర్గాల హెచ్చరిక నేపథ్యంలో మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యాయి. మణిపూర్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. అస్సాం రైఫిల్స్ సిబ్బంది సరిహద్దులకు తరలించారు. అంతేకాదు ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో కూడా నిఘాను మరింతగా పెంచారు.
ఇంఫాల్‌లో నలుగురిని అరెస్టు చేసిన సిబ్బంది మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంగళవారం ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలపై IRB జవాన్‌తో సహా నలుగురిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఇంటెలిజెన్స్ అధికారుల బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కేరాంగ్ అవాంగ్ లికాయ్, ఖోమిడోక్‌తో పాటు అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ.2.5 లక్షల నగదు, పలు మొబైల్ ఫోన్లు, రెండు కార్లతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
మే 3 నుంచి మొదలైన హింస మణిపూర్ లో మే 3 నుండి మొదలైన హింసతో నేటి వరకూ ఆ రాష్ట్రము అట్టుడికిపోతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కేంద్ర, ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అనేక జిల్లాలో పెట్టని కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాలో ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతూనే ఉంది. హింసాత్మక ఘటనతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 100 మందికి పైగా మృతి చెందారు. అనేక ఇల్లు దగ్ధమయ్యాయి. తమ సొంత ఇళ్లను వదిలి బాధితులు సహాయక శిబిరాలకు చేరుకొని తలదాచుకుంటున్నారు.
ఇప్పటికే మణిపూర్ లో హింసాత్మక ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటించారు. బాధితులను కలిసిన పరామర్శించారు. ఘటనపై న్యాయ విచారణ చేపట్టినట్లు ప్రకటించారు. ప్రజలు శాంతిగా ఉండాలని కోరారు.. అధికారులు శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




