మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 5 జిల్లాల్లో హై అలర్ట్‌ ..

ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు, శాంతి భద్రతల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపుర్, కాక్చింగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఆయా జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని పోలీసులు అభ్యర్థించారు.

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 5 జిల్లాల్లో హై అలర్ట్‌ ..
Manipur Curfew

Updated on: Jun 08, 2025 | 7:09 AM

మణిపూ‌ర్‌లో మళ్లీ హింస చెలరేగింది. మైతేయ్ నాయకుల అరెస్ట్‌తో ఇంఫాల్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులు రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. తమ నాయకులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకారుల నిరసనలతో మణిపూర్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు, శాంతి భద్రతల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపుర్, కాక్చింగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఆయా జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని పోలీసులు అభ్యర్థించారు.