త్రిపుర(Tripura) ముఖ్యమంత్రిగా బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ సాహా(Manik Saha ) ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలలోని రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో మాణిక్ చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 11వ త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణం చేశాడు. రాజ్యసభ సభ్యుడైన మాణిక్ సాహా.. ప్రస్తుతం భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి..
2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిప్లవ్ కుమార్ దేవ్ శనివారం రాజీనామా చేశారు. సీఎం అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సాహాను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వృత్తి రీత్యా డెంటల్ డాక్టర్ అయిన 69 ఏళ్ల సాహా 2016లో కాంగ్రెస్‌ను వడిచి బీజేపీలో చేరారు. 2020 నుంచి బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 మార్చిలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Manik Saha takes oath as Tripura Chief Minister
Read @ANI Story | https://t.co/caDdeMiRXC#ManikSaha #TripuraCM #ChiefMinister #ManikSahaTakesOath pic.twitter.com/ivBt7gPPaS
— ANI Digital (@ani_digital) May 15, 2022
త్రిపుర బీజేపీలో చిచ్చు
ముఖ్యమంత్రి మార్పు త్రిపుర బీజేపీలో చిచ్చు రేపింది. బిప్లవ్‌దేవ్ స్థానంలో మాణిక్ సాహాను ఎంపిక చేయడంతో పార్టీలో అంతర్గత కలహాలు బయటపడిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం భావించినట్టు అధికార మార్పిడి అంత సులువుగా జరగలేదు. బిప్లవ్‌దేవ్ మద్దతుదారులు హైకమాండ్ పరిశీలకుల సమక్షం లోనే నానా హంగామా చేశారు. బిప్లవ్‌దేవ్ నివాసం ఈ గొడవకు వేదికయ్యింది. బిప్లవ్‌దేవ్‌ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు సీఎంగా ఎంపికైన మాణిక్ సాహా. అక్కడే ఉన్న మంత్రి రామ్‌ప్రసాద్ పౌల్ నానా హంగామా చేశారు. కుర్పీలో వేశారు రామ్‌ప్రసాద్ . ఆయన్ను సముదాయించడానికి చాలా అవస్థలు పడ్డారు బీజేపీ నేతలు. కేంద్రమంత్రి . బీజేపీ అగ్రనేత భూపేంద్రయాదవ్ సమక్షం లోనే ఈ గొడవ జరిగింది.
జాతీయ వర్తల కోసం..
ఇవి కూడా చదవండి: Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్..
Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..