Video: రాజీవ్‌ గాంధీపై మణిశంకర్‌ అయ్యర్‌ సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు

రాజీవ్ గాంధీ అకాడమిక్ రికార్డ్స్ గురించి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజీలలో ఆయన ఫెయిల్యూర్ గురించి అయ్యర్ పేర్కొన్నారు. బీజేపీ ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Video: రాజీవ్‌ గాంధీపై మణిశంకర్‌ అయ్యర్‌ సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు
Rajiv Gandhi Mani Shankar A

Updated on: Mar 05, 2025 | 7:43 PM

రాజీవ్ గాంధీ అకాడమిక్‌ క్వాలిఫికేషన్స్‌పై కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ హైలెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం కాంగ్రెస్‌లోనూ కొత్త చిచ్చు రేపింది. ఇంతకీ మణిశంకర్‌ అయ్యర్‌ ఏమన్నారంటే.. “కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఫెయిల్‌ అయ్యారని, అక్కడ ఫెయిల్‌ అవ్వడం అంటూ ఉండదని, అంతా పాస్‌ అవుతారని, యూనివర్సిటీ సైతం తన విద్యార్థులను ఫెయిల్‌ అయ్యేలా టీచ్‌ చేయ్యదని, అలా ఫెయిల్‌ అయితే యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుంది, అందుకే అక్కడ విద్యార్థులు ఫెయిల్‌ అవ్వడం కష్టం” అని అయ్యర్ అన్నారు.

“రాజీవ్ గాంధీ చదువు విషయంలో చాలా కష్టపడ్డాడు, కేంబ్రిడ్జ్‌లో ఫెయిల్‌ అయ్యాడు. అక్కడ ఉత్తీర్ణత చాలా సులభం. అయినా కూడా ఫెయిల్‌ అయ్యాడు. ఆ తర్వాత ఆయన లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి మారారు కానీ అక్కడ కూడా ఫెయిల్‌ అయ్యాడు. అలా రెండు సార్లు ఫెయిల్‌ అయిన వ్యక్తి ప్రధానమంత్రి ఎలా అవుతాడని అప్పట్లో చాలామంది ప్రశ్నించారని అని మణిశంకర్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన ఈ వీడియోను బీజేపీ షేర్ చేసింది. అదే వీడియోలో అయ్యర్‌ మాట్లాడుతూ.. “నేను రాజీవ్‌ గాంధీతో కలిసి కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నాను. రాజీవ్ ప్రధానమంత్రి అయినప్పుడు, రెండుసార్లు విఫలమయ్యాడు. ఇతను ప్రధాని ఎలా అవుతాడని అనుకున్నాను” అని అయ్యర్‌ పేర్కొన్నారు. అయ్యర్‌ మాట్లాడిన వీడియోను బీజేపీ షేర్‌ చేయడంతో కాంగ్రెస్‌లో ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.