Health Ministry Canteen: ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాంటీన్‌లో జంక్ ఫుడ్‌కు స్వస్తి.. ఆరోగ్యకరమైన ఆహారం
Health Ministry Canteen: కేంద్ర ఆరోగ్యశాఖ క్యాంటీన్‌లో ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించారు ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ. ఆరోగ్యరమైన ఆహారాలను అందించేందుకు..
Health Ministry Canteen: కేంద్ర ఆరోగ్యశాఖ క్యాంటీన్‌లో ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించారు ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ. ఆరోగ్యకరమైన ఆహారాలను అందించేందుకు చర్యలు చేపట్టారు. క్యాంటీన్‌లో వేయించిన ఆహార పదార్థాలను తొలగించింది ఆరోగ్యశాఖ. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. క్యాంటీన్‌లో సమోసాలు, బ్రెడ్, పకోడా వంటి వేయించిన ఆహార పదార్థాల స్థానంలో బఠానీలు, ఆరోగ్యకరమైన కూరలు, మిల్లెట్స్, రోటీలు, దాల్ చిల్స్ ఉన్నాయి.
దాల్ చిల్స్ రూ.10, ఆల్పాహారం రూ.25, మధ్యాహ్నం భోజనం 40లకు అందుబాటులో ఉంటుంది. మాండవియా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి క్యాంటీన్‌కు ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆహార పదార్థాల ఎంపికపై చర్యలు చేపట్టారు.
కాగా, మంత్రి మాండవియా స్వయంగా పార్లమెంట్‌కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ వార్తల్లోకెక్కారు. మంత్రి ప్రతి రోజు వ్యాయమంతో పాటు దాదాపు 20 కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారు. ఆరోగ్యపై జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ ఆర్భాటం లేకుండా పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చిన మన్సుఖ్ మాండవ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజలకు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం తన బాధ్యతగా భావించే మన్సుఖ్.. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశ్యంతో ఇటీవల రాజ్యసభకు వెళ్తూ కనిపించారు.
ఇవి కూడా చదవండి: