Viral: పైనుంచి చూస్తే పత్తి చేనే.. లోపలికి వెళ్లి తనిఖీలు చేసి.. కంగుతిన్న పోలీసులు

|

Nov 21, 2022 | 5:43 PM

అక్రమార్కులు రోజురోజుకు అప్‌డేట్ అవుతున్నారు. క్రైమ్ చేయడానికి కూడా క్రియేటివిటీ వాడుతున్నారు. ఇవే తెలివితేటలు మంచి పనుల కోసం వాడరు ఎందుకో....

Viral: పైనుంచి చూస్తే పత్తి చేనే.. లోపలికి వెళ్లి తనిఖీలు చేసి.. కంగుతిన్న పోలీసులు
Cotton Field (Representative image)
Follow us on

మత్తు చిత్తు చేస్తుంది. యువతీయువకులు జీవితాలను బలి తీసుకుంటుంది. ముఖ్యంగా గంజాయి ప్రజంట్ అందరికీ ఈజీగా దొరకుతుంది. ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నా.. అక్రమార్కులు మాత్రం తమ మార్క్ క్రియేటివిటీ ఉపయోగిస్తూ గంజాయి అక్రమ సాగు, రవాణా చేస్తున్నారు. అందుకు అటవీ, ఏజెన్సీ ప్రాంతాలను ఎన్నుకుంటున్నారు. గిరిపుత్రులకు డబ్బులు ఎర చూపి.. వారిని పావులుగా చేసుకుని దందా నడుపుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ధర్ జిల్లాలోని మనవార్ పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇక్కడ గంజాయి సాగు కోసం.. పత్తి చేనును ఎన్నుకున్నాడు నిందితుడు. పొలం మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా పెంపకం షురూ చేశాడు. కానీ ఇన్‌ఫార్మర్ ద్వారా పోలీసులకు సమాచారం అందండంతో బాగోతం బయటపడింది.

పత్తి పొలంపై దాడి చేసి ఎగుమతికి సిద్దంగా ఉంచిన 105 కిలోల బరువున్న 44 గంజాయి బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు మనవార్ పోలీసులు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి నీరజ్ బిర్తారే తెలిపారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ గంజాయి సాగును అరికట్టాలని, నిందితులను పట్టుకోవాలని ధార్ ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే హనుమంత్య నయాపురా వద్ద పత్తి పొలంలో అక్రమంగా గంజాయి సాగు జరుగుతోందని సబ్-ఇన్‌స్పెక్టర్ అభిషేక్ జాదవ్ ఇన్‌ఫార్మర్ నుంచి సమాచారం అందించింది. ఈ చేను కువాడ్ నివాసి రమేష్ భిలాలాకు చెందినది.

వెరిఫికేషన్‌ తర్వాత సమాచారం సరైనదని పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 105 కిలోల బరువున్న 44 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతనిపై సెక్షన్ 8/20 NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దాడిని ముందుగానే పసిగట్టిన నిందితుడు రమేష్ పారిపోయాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం