కలెక్టర్ నిర్వాకంతో ఫోన్ పోయినా,, స్వయంగా ముఖ్యమంత్రే ఆదుకున్నారు ..భలే ! ఛత్తీస్ గడ్ లో ఆ యువకుడి లక్కే లక్కు ! సద్దు మణిగిన వివాదం
ఛత్తీస్ గడ్ లో సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ ఓ యువకుడిని కొట్టి అతని సెల్ ఫోన్ ను డ్యామేజ్ చేయడమే కాకుండా దూరంగా పారవేసిన ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారం ఎలా తెలిసిందో గానీ...
ఛత్తీస్ గడ్ లో సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ ఓ యువకుడిని కొట్టి అతని సెల్ ఫోన్ ను డ్యామేజ్ చేయడమే కాకుండా దూరంగా పారవేసిన ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారం ఎలా తెలిసిందో గానీ సీఎం భూపేష్ బాఘేల్ కి తెలిసింది. వెంటనే ఆయన ఆ యువకునికి పరిహారంగా కొత్త ఫోన్ కొని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రణబీర్ శర్మ అనే ఆ కలెక్టర్ ఆ యువకుడి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆయన అభిప్రాయపడినట్టు కనిపిస్తోంది. ఇక అధికారులు అతనికి కొత్త ఫోన్ కొని ఇచ్ఛే ప్రయత్నంలో పడ్డారు. డబుల్ బొనాంజా అన్నట్టు రాష్ట్ర ఐ ఏ ఎస్ అధికారుల సంఘం కూడా ఆ వ్యక్తి పట్లే మొగ్గు చూపింది. కలెక్టర్ అతని పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని, తన ఆదాయం నుంచి అతనికి పరిహారం చెల్లించాలని ఈ సంఘం సూచించింది. ఒక సీనియర్ అధికారి ఇలా బిహేవ్ చేయడం సముచితంగా లేదని ఈ సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. కాగా శర్మ అప్పుడే తన చర్యకు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే..
లాక్ డౌన్ సమయంలో ఎందుకు బయటికి వచ్చావని ఆ యువకుడిని బెదిరించగా ఆ వ్యక్తి ఏదో చెప్పబోయేంతలో అతడిని శర్మ కొట్టి అతని ఫోన్ ని దూరంగా పారేసిన వైనం వీడియోకెక్కింది. మొత్తానికి గుర్తు తెలియని యువకుడికి మంచి పరిహారమే లభించింది.
मुख्यमंत्री @bhupeshbaghel जी ने निर्देश दिए हैं कि सूरजपुर में कलेक्टर द्वारा नवयुवक के साथ दुर्व्यवहार के दौरान नवयुवक के क्षतिग्रस्त मोबाइल की प्रतिपूर्ति के रूप में उस नवयुवक को नया मोबाइल फोन उपलब्ध कराया जाए।
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) May 23, 2021