Goat’s Eye: మనిషి ప్రాణం తీసిన మేక కన్ను.. నమ్మశక్యం కాని రీతిలో మృత్యుఒడికి.. పూర్తి వివరాలివే..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో నమ్మశక్యం కాని ఓ విషాద సంఘటన జరిగింది. జిల్లాలోని ఖోపా ధామ్‌ ఆలయానికి వెళ్లిన బగద్ సాయి(50) అనూహ్య రీతిలో మేక కన్ను గుచ్చుకుని మరణించాడు. మదన్‌పూర్ గ్రామానికి చెందిన..

Goats Eye: మనిషి ప్రాణం తీసిన మేక కన్ను.. నమ్మశక్యం కాని రీతిలో మృత్యుఒడికి.. పూర్తి వివరాలివే..
Representative Image

Updated on: Jul 04, 2023 | 6:13 PM

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో నమ్మశక్యం కాని ఓ విషాద సంఘటన జరిగింది. జిల్లాలోని ఖోపా ధామ్‌ ఆలయానికి వెళ్లిన బగద్ సాయి(50) అనూహ్య రీతిలో మేక కన్ను గుచ్చుకుని మరణించాడు. మదన్‌పూర్ గ్రామానికి చెందిన సాయి ఆదివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఖోపా ధామ్ ఆలయానికి వెళ్లి అందరితో కలిసి మేకను బలి ఇచ్చాడు. అనంతరం బలి ఇచ్చిన మేక మాంసం తినేందుకు అందరితో కలిసి కూర్చున్నాడు. సాయికి వడ్డించిన మాంసంతో పాటు మేక కన్ను కూడా వచ్చింది.

అయితే దాన్ని ఉత్సాహంతో తినడమే అతని పాలిట యమపాశంగా మారింది. తనకు వచ్చిన మేక కన్నును ఎంతో ఆశగా నోట్లో వేసుకున్న సాయికి అది గొంతులో ఇరుక్కుపోయింది. గొంతులోనే ఉండిపోయిన ఆ కన్ను కారణంగా సాయి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోయాడు. అప్పటివరకు తమతో కలిసి ఉత్సాహంగా గడిపిన సాయి పరిస్థితిని చూసిన అతని కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ సాయి ప్రాణాలను కాపాడడం కోసం వారు చేసిన ప్రయత్నాలకు అతని శ్వాసనాళంలోని మేక కన్ను అడ్డుగా నలిచింది. దీంతో అతను చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..