Crime News: గర్భంతో ఉన్న ప్రియురాలిని హత్యచేసిన ప్రియుడు.. ప్లాన్ ప్రకారమే అంతా..

|

Aug 15, 2022 | 8:58 AM

ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని.. నమ్మించి.. చివరకు గర్భం దాల్చిన 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపిన ఘటన మహారాష్ట్రలోని థానే సమీపంలోని ముంబ్రాలో జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో..

Crime News: గర్భంతో ఉన్న ప్రియురాలిని హత్యచేసిన ప్రియుడు.. ప్లాన్ ప్రకారమే అంతా..
Crime
Follow us on

Crime News: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని.. నమ్మించి.. చివరకు గర్భం దాల్చిన 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపిన ఘటన మహారాష్ట్రలోని థానే సమీపంలోని ముంబ్రాలో జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో.. బైక్ పై బయటకు వెళ్దామని చెప్పి ప్రియురాలిని తీసుకెళ్లి.. కత్తితో పొడిచి, మృతదేహన్ని ఓ క్వారీ సమీపంలోని కొండ ప్రాంతంలో పడేశాడు. ముంబ్రాకు చెందిన అల్తమాష్ దల్వీ మూడేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అతడు ఓ చిన్న కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తూ.. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల నిందితుడు అల్తమాష్ దల్వీకి వేరే అమ్మాయితో పెళ్లి కుదిరింది.

విషయం తెలసుకున్న యువతి దల్వీ గురించి ఆ అమ్మాయికి చెప్పేందుకు ప్రయత్నించారు. ఇదే విషయంపై నిందితుడిని ప్రశ్నించారు. దీంతో యువతిపై కోపం పెంచుకున్న దల్వీ.. తను గురించి అందరికి చెప్తే పెళ్లి ఆగిపోతుందనే ఉద్దేశంతో యువతిని చంపాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా హత్య చేయడానికి రెండు రోజుల ముందు 13 అంగుళాల కత్తిని కొనుగోలు చేశాడు. శనివారం బయటకు వెళ్దామని రమ్మని బైక్ పై ఎక్కించుకుని కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఓ క్వారీ వద్దకు వెళ్లి.. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కత్తితో పొడిచి.. మృతదేహాన్ని పొదల్లోకి విసిరి పారియపోయాడు. క్వారీ సమీపంలోని ప్రజలు మృతదేహన్ని చూసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. ప్రియుడే యువతిని హత్యచేసినట్లు నిర్థారించారు. నిందితుడు దాల్వీని థానేలో పోలీసులు అరెస్టు చేశారు. యువతి దాల్వీని ఇష్టంగా ప్రేమించిందని.. తననే పెళ్లిచేసుకోవాలనుకుందని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే యువతి గర్భం దాల్చినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..