Shocking Video: ఢిల్లీలో దారుణం.. ముగ్గురు వ్యక్తులపై నుంచి దూసుకెళ్లిన కారు.. ఆరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..
ఢిల్లీలో దారుణం జరిగింది. అలీపూర్ ప్రాంతంలోని ఇరుకు రహదారిలో కారు వెళ్తుండగా.. బైక్ అడ్డంగా ఉండటంతో కారులో ఉన్న వ్యక్తులు అక్కడ బైకుపై ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో కొంతమంది యువకులు అక్కడికి..
ఢిల్లీలో దారుణం జరిగింది. అలీపూర్ ప్రాంతంలోని ఇరుకు రహదారిలో కారు వెళ్తుండగా.. బైక్ అడ్డంగా ఉండటంతో కారులో ఉన్న వ్యక్తులు అక్కడ బైకుపై ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో కొంతమంది యువకులు అక్కడికి చేరుకున్నారు. గొడవ సర్థుకుంటుందనుకున్న సమయంలో ఏమైందో ఏమో గాని కారులోని వ్యక్తి కారును అక్కడ ఉన్న వ్యక్తుల పైనుంచి ఎక్కించుకుని వెళ్లాడు. ఈ ఘటనలో ఆరేళ్ల బాలుడితో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఎవరికి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటనతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన వివరాల ప్రకారం రోడ్డుకు కాస్త పక్కన ఒక వ్యక్తి బైకుపై ఆగి ఉన్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి బైకుకు డాష్ ఇచ్చింది. అనంతరం కారులో నుంచి ఒక వ్యక్తి దిగి బైకుపై ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో కొంత మంది యువకులు అక్కడికి చేరుకున్నారు.
బైక్ రహదారికి అడ్డంగా పెట్టారు ఏంటంటూ కారులో వచ్చిన ఒక వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. బైకుపై ఉన్న వ్యక్తితో పాటు.. అక్కడ ఉన్న కొంత మంది యువకులకు, కారులోని వ్యక్తికి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. గొడవ సర్ధుమనుగుతుందనుకున్న సమయంలో.. దారుణం జరిగింది. అక్కడి నుంచి వెళ్తున్నట్లే వెళ్తూ యువకులపై నుంచి కారు ఎక్కించాడు. కారు టైర్ల కింద ముగ్గురు వ్యక్తులు చిక్కకున్నారు. అయితే ముగ్గురిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
యువకుల మీదకు ఎక్కించిన తర్వాత కారు కాస్త ఆగడంతో అప్పటికే అక్కడ గుమిగూడి గొడవను చూస్తున్నవారు.. పరుగు పరుగున అక్కడికి వచ్చే లోపు, అతడు కారును ముందుకు పోనిచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 307 (హత్యానేరం) కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: A car ran over people in Alipur area on Oct 26 following an argument with a bike rider. 3 people injured & admitted to a hospital. Accused driver, Nitin Maan has been arrested, case registered under sec of IPC incl 307 (attempt to murder). Probe on.
(Source:CCTV) pic.twitter.com/523eyA2v8C
— ANI (@ANI) October 28, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..