
ఈశాన్య రాష్ట్రాల్లో జూన్ నెల ఆరంభంలోనే వరుణుడు ప్రతాపం చూపించాడు. ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు, పొటెత్తుతున్న వరదలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. 34మందికి పైగా చనిపోగా వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాలనుంచి వందల కుటుంబాలను రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అస్సాం, మణిపూర్, త్రిపుర సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం స్తంభించింది.
ఇంతలోనే అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు పణంగా పెట్టి నది దాటుతున్న వీడియో వైరల్ గా మారింది.. దీనిని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు షేర్ చేశారు.. రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు యత్నించాడు.. ఈ వీడియో షేర్ చేస్తూ కిరణ్ రిజిజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. ప్రభుత్వం అవసరమైన సాయం అందిస్తున్నది చెప్పారు.. నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది..
ఇదిలాఉంటే.. అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ సహా మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ చెప్పింది. ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. సిక్కింలోని తీస్తానదిలో టూరిస్ట్ బస్సు పడిపోయిన ఘటనలో గల్లంతయిన 8 మంది ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. మేఘాలయలో 10 జిల్లాల్లో 10వేల మంది వరదలతో ప్రభావితమయ్యారు. అసోంలో 19 జిల్లాల్లో 764 గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి. సిక్కింలో చిక్కుకున్న 1500 మంది టూరిస్టులను వారివారి ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కొనసాగుతోంది.
ArunachalPradesh receives heaviest Monsoon rains in the world. Got this video of a man crossing traditional hanging bridge in Anjaw district, Arunachal Pradesh near tri-junction of India, China & Myanmar border. Please remain careful & safe. Govt will provide necessary support. pic.twitter.com/GZ9ypeOzZj
— Kiren Rijiju (@KirenRijiju) June 1, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..