బెంగాల్ లో బీజేపీ 100 సీట్లకు పైగా గెలిస్తే ఇక పార్టీలకు సాయమనే ఊసే ఎత్తను, ప్రశాంత్ కిషోర్

| Edited By: Anil kumar poka

Mar 03, 2021 | 1:38 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లకు పైగా గెలుచుకుంటే ఇక వేరే పనులేవో చూసుకుంటానని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.

బెంగాల్ లో బీజేపీ 100 సీట్లకు పైగా గెలిస్తే ఇక పార్టీలకు సాయమనే ఊసే ఎత్తను, ప్రశాంత్ కిషోర్
Follow us on

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లకు పైగా గెలుచుకుంటే ఇక వేరే పనులేవో చూసుకుంటానని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీజేపీని ఆయన ఇలా ఛాలెంజ్ చేశారు. కమలం పార్టీ ఇన్ని సీట్లను గెలిస్తే ఇక వేరే జాబ్ ఏదో చూసుకుంటానని, తన పొలిటికల్ టీమ్ ని కూడా వదిలేసుకుంటానని, పైగా మరే  రాజకీయ పార్టీకి కూడా పని చేయనని ఆయన చెప్పారు.  అసలు ఇప్పుడు నేను ఉన్నట్టు ఉండనే ఉండనన్నారు.  ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.ఉత్తర ప్రదేశ్ లో తన వ్యూహం పని చేయలేదని, ఇందుకు కారణం తాము కోరాలనుకున్న పనిని తాము చేయలేకపోయామని, కానీ  బెంగాల్ లో ఇలా లేదని, దీదీ తనకు ఎంతో స్వేఛ్చ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇక్కడ టీఎంసీ ఓడిపోతే తన జాబ్ ని కోల్పోయినట్టేనని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఈ రాష్టంలో ఈ పార్టీ తనకు తాను కుప్పకూలిపోతేనే బీజేపీ ఇక్కడ పైకి రాగలుగుతుందని పేర్కొన్న ఆయన, ఈ పార్టీలో కొన్ని అంతర్గత పరస్పర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పారు. ఆ గ్యాప్స్ ని బీజేపీ ఉపయోగించుకోజూస్తున్నదని అన్నారు.

చాలామంది తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంపై ఆయన స్పందిస్తూ.. డబ్బులు,టికెట్లు, పదవులు ఇస్తామంటే ఎవరైనా ఇందుకు లొంగవచ్చునన్నారు. అది వారి తప్పు కాదన్నారు. పైగా వారు (బీజేపీ) ఇతరులను బాగా ప్రలోభపెట్టగలుగుతారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. తన కారణంగానే కొందరు తృణమూల్ ని వీడుతున్నారని వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. స్నేహితులను తయారు చేసేందుకు తానిక్కడ లేనని, తన ఉద్దేశం పార్టీ (టీఎంసీ) గెలవాలన్నదేనని చెప్పారు. మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలకు ఆమె పట్ల పూర్తి విశ్వాసం ఉందన్నారు. తాము 200 సీట్లకు పైగా గెలుచుకుంటామన్న హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన గురించి ఆయన.. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో భయాన్ని, ఆందోళనను సృష్టించే ప్రయత్నమే ఇదన్నారు. ప్రధాని మోదీ ర్యాలీలకే పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారని, ఇతర బీజేపీ నేతల సభలకు 200 కు మించి రావడంలేదని అయన చెప్పారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

మంత్రిగారి డర్టీ పిక్చర్..బయటపడిన మినిష్టర్ అశ్లీల ఫోటోలు, వీడియోలు : Karnataka Minister Private Video

ఒళ్ళో చంటిపాప.. వీరితో పోరాడి ఓడిన మహిళ వైరల్ అవుతున్న వీడియో : Delhi Chain snatcher stabs woman video