సైకిళ్ల నుంచి క్షిపణుల దాకా.. చేతి వృత్తులను ప్రపంచానికి పరిచయం చేసిన మేక్ ఇన్ ఇండియా

|

Jul 18, 2024 | 1:08 PM

లోకల్ క్రాఫ్ట్ టూ గ్లోబల్ ఇంపాక్ట్ వరకు మేడ్ ఇన్ ఇండియా దూసుకుపోతోంది. మేడ్ ఇన్ ఇండియా విశ్వ వ్యాప్తం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సైకిళ్లు, స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి నుండి డిజిటల్ చెల్లింపుల వరకు, భారతదేశం తన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది.

సైకిళ్ల నుంచి క్షిపణుల దాకా.. చేతి వృత్తులను ప్రపంచానికి పరిచయం చేసిన మేక్ ఇన్ ఇండియా
Made In India
Follow us on

లోకల్ క్రాఫ్ట్ టూ గ్లోబల్ ఇంపాక్ట్ వరకు మేడ్ ఇన్ ఇండియా దూసుకుపోతోంది. మేడ్ ఇన్ ఇండియా విశ్వ వ్యాప్తం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సైకిళ్లు, స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి నుండి డిజిటల్ చెల్లింపుల వరకు, భారతదేశం తన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. సాంప్రదాయిక రంగాల నుండి రష్యా సైన్యానికి బూట్‌లను తయారు చేయడం, ప్రీమియం క్రికెట్ పరికరాలను తయారు చేయడం, సూపర్‌సోనిక్ క్షిపణులను ఎగుమతి చేయడం వంటి చూస్తుంటే ఊహించని రంగాలలోకి వైవిధ్యభరితంగా మారింది. ఏకంగా అంతర్జాతీయ మార్కెట్లను మార్చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది మేడ్ ఇన్ ఇండియా ప్రయాణం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో కూడిన నాయకత్వంలో భారతదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2014లో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దేశ తయారీ రంగంలో విశేషమైన పరివర్తనకు దారితీసింది. ఆర్థిక పునరుజ్జీవనాన్ని ప్రపంచ వేదికపైకి నడిపించింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుని వెళుతున్న మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ప్రధాని మోదీ ఒక పోస్ట్‌లో MyGovIndia ద్వారా ఒక పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు. స్థానిక చేతివత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపుతున్నాయో పేర్కొన్నారు.

భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా అవతరించింది. ఒకప్పుడు 80% మొబైల్ ఫోన్లు దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం 99.9% ఫోన్‌లు భారతదేశంలోనే తయారవుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలైన UK, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఇతర దేశాలు మేడ్-ఇన్-ఇండియా మొబైల్‌లను ఉపయోగిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దింది. రక్షణ రంగ ఉత్పత్తులు, స్పేస్, ఎలక్ట్రిక్ వాహన రంగం, సెమీ కండక్టర్స్, కన్‌స్ట్రక్షన్, రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలలో ఎఫ్‌డీఐ పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూరుతున్నాయి.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సెప్టెంబర్ 25, 2014న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోద చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. పెట్టుబడిని సులభతరం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, అత్యుత్తమ, మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, తయారీ, డిజైన్, ఆవిష్కరణలకు భారతదేశాన్ని కేంద్రంగా మార్చేసింది. ఇవి కేవలం సాంప్రదాయికమైనవి కాకుండా.. మేక్ ఇన్ ఇండియా తనదైన ముద్ర వేస్తున్న కొన్ని అనూహ్య రంగాలు ఉన్నాయి.

బీహార్‌లోని హాజీపూర్ రష్యన్ ఆర్మీకి అవసరమైన బూట్లను తయారు చేస్తోంది. వ్యవసాయోత్పత్తికి ప్రసిద్ధి చెందిన బీహార్‌లోని హాజీపూర్, రష్యా సైన్యం కోసం సేఫ్టీ షూలను తయారు చేయడం ద్వారా మేక్ ఇన్ ఇండియా తన సత్తా చాటింది. 300 మంది ఉద్యోగులతో, అందులో 70% మంది మహిళలు పని చేస్తుండటం విశేషం. గత ఏడాది రూ. 1.5 మిలియన్ జతల బూట్లను ఎగుమతి చేసింది. దీని ద్వారా మహిళల స్వశక్తితో రూ. 100 కోట్లు అర్జించారు.

ఒకప్పుడు సైకిల్లను దిగుమతి చేసుకున్న భారత్, మేకిన్ ఇండియా ద్వారా ప్రపంచానికి సరికొత్త సైకిల్లను పరిచయం చేసింది. ఏకంగా UK, జర్మనీ, నెదర్లాండ్స్‌ల్లో మన దేశంలో తయారైన సైకిళ్లకు డిమాండ్ పెరిగింది. మేడ్ ఇన్ చైనా సైకిళ్ల కంటే భారత్ తయారు చేసిన సైకిళ్ల నాణ్యత చాలా మెరుగ్గా ఉందని, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఈ దేశాల్లో అత్యుత్తమ ఎంపికగా మారాయి.

భారతదేశంలో అందుబాటులో ఉన్న ఉత్పత్తుల శ్రేణిలో అమూల్ పాలు అమెరికాకు వచ్చాయి. పనీర్, పెరుగు, రుచి గల పాలు, ఐస్ క్రీములు, చాక్లెట్లు ఇతరాలతో సహా అమూల్ ఉత్పత్తులు ఆసియా, గల్ఫ్, ఆఫ్రికాలోని 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది.

కాశ్మీర్ విల్లో బ్యాట్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మేడ్ ఇన్ ఇండియా కాశ్మీర్ విల్లో బ్యాట్‌లకు 2023 ప్రపంచ కప్ సందర్భంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుండి పెద్ద ఎత్తున ఎగుమతి ఆర్డర్లు వచ్చాయి. గేమ్‌లో 17 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాశ్మీర్ బ్యాట్‌లను ఉపయోగించడంతో, ఈ బ్యాట్‌లు గ్లోబల్ ఫేవరెట్‌గా మారాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింతగా పెంచేందుకు కాశ్మీర్ విల్లో బ్యాట్‌లకు GI ట్యాగ్‌ని పొందేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది.

భారతదేశం నుండి మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఆగ్నేయాసియా దేశానికి ఆయుధ వ్యవస్థలను సరఫరా చేయడానికి 375 మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. రెండేళ్ల తర్వాత, భారతదేశం ఫిలిప్పీన్స్‌కు మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను పంపిణీ చేసింది.

మేడ్-ఇన్-ఇండియా UPI గ్లోబల్ ఫేవరెట్‌గా మారుతోంది. ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, భూటాన్, UAE, సింగపూర్, నేపాల్ వంటి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సైతం భారత డిజిటల్ చెల్లింపుల బాటలో నడుస్తున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఇప్పుడు బహుళ దేశాలలో డిజిటల్ చెల్లింపులకు మార్గదర్శకంగా మారింది.

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే , సైబర్ సోమవారం విక్రయాలలో భారతీయ ఉత్పత్తులు ఆధిపత్యం చెలాయించాయి. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్. ప్రపంచ ఇ-కామర్స్ మార్కెట్‌లలో భారతదేశం పెరుగుతున్న ఉనికిని చూపుతుంది.

భారత ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు మోదీ ప్రభుత్వం అనేక విధానపరమైన కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు, పద్నాలుగు రంగాలలో ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం పరిచయం, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (NIP), నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (NMP), ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ (IILB) కింద పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టం (IPRS), నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) సాఫ్ట్ లాంచ్ మొదలైనవి. అన్నింటిలో ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్ (PDCలు) రూపంలో పెట్టుబడులను త్వరితగతిన ట్రాక్ చేయడానికి ఒక సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…