Fire broke out in mankhurd area Mumbai: ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మన్‌ఖుర్ద్ ప్రాంతంలోని మాండ్లా రసాయన కర్మాగారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పడానికి 14 నుంచి 15 అగ్నిమాపక దళాల సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చుట్టు పక్కల ప్లాస్టిక్ కర్మాగారాలు ఉండటంతో ఇంకా మంటలు పెరిగే ప్రమాదముంది. దీంతో ఆయా ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రాంతంలో మంటలు చెలరేగాయని ప్రత్యేక్ష సాక్షలు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో రసాయనాలు కర్మాగారాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH I Maharashtra: A fire has broken out at a godown in Mankhurd area of Mumbai; no injuries reported so far. pic.twitter.com/LtaRkvaVty
— ANI (@ANI) February 5, 2021
Also Read: