ఆందోళనలతో వీధులను ముంచెత్తండి, పంజాబ్ రైతులకు నిందితుడు లఖానా ‘పిలుపు’

ఆందోళనలతో వీధులను ముంచెత్తాలని గతనెల 26 నాటి ఢిల్లీ అల్లర్ల కేసు ప్రధాన నిందితుడు, సోషల్ యాక్టివిస్ట్ గా మారిన గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్..

  • Umakanth Rao
  • Publish Date - 5:18 pm, Sat, 6 February 21
ఆందోళనలతో వీధులను ముంచెత్తండి, పంజాబ్ రైతులకు నిందితుడు లఖానా 'పిలుపు'

ఆందోళనలతో వీధులను ముంచెత్తాలని గతనెల 26 నాటి ఢిల్లీ అల్లర్ల కేసు ప్రధాన నిందితుడు, సోషల్ యాక్టివిస్ట్ గా మారిన గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్ అలియాస్ లఖా సిధానా ‘పిలుపు నిచ్చాడు’. నాటి ఢిల్లీ అల్లర్లలో పంజాబీ నటుడు దీప్ సిధుని, ఇతడిని ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ ఐ ఆర్ లో మెయిన్ ఎక్స్క్యూజ్డ్ గా పేర్కొన్నారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రధాన వీధుల్లో భారీ ఎత్తున ఆందోళన చేయాలని లఖానా ఈ నెల 4 న ఫేస్ బుక్ లో వీడియో అప్ లోడ్ చేశాడు. దీన్ని నిన్న రిలీజ్ చేశాడు. రాష్ట్ర అన్నదాతలు శనివారం ప్రతి వీధిని ఇలా ప్రొటెస్ట్ లతో ముంచెత్తాలని, ఆత్మవిశ్వాసంతో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఈ నిందితుడు కోరాడు. ఢిల్లీలోనే కాక, పంజాబ్ లో కూడా ప్రజలు, అన్నదాతలంతా ఐక్యంగా ఉన్నామని నిరూపించాలని, మన మనుగడను దెబ్బ  తీసే అరాచకవాదుల ఆటలు కట్టించాలని లఖానా ఈ వీడియోలో కోరాడు. పంజాబ్ మళ్ళీ ప్రమాదంలో పడుతోంది.. ఇది ప్రతివ్యక్తి మనుగడకు సంబంధించిన సమస్య.. అంతా మేల్కొనాలి.. ఇప్పుడు మేల్కొనకపోతే ఈ రాష్ట్రం చెత్త బుట్ట లా మారిపోతుంది అని ఇతగాడు ఈ వీడియోలో హెచ్చరించాడు.

బహుశా తిక్రి ప్రొటెస్ట్ సైట్ వద్ద ఈ వీడియోను చిత్రీకరించాడని పోలీసులు భావిస్తున్నారు. హర్యానా-పంజాబ్ మధ్య ఇతడు తిరుగుతున్నాడని, నిరసన స్థలాల వద్ద ఇతనిమద్దతుదారులు ఇంకా తిష్ట వేసి ఉన్నారని వారు చెప్పారు. జనవరి 26 న రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అన్నదాతలను లఖానా రెచ్ఛగొట్టాడని ఖాకీలు కేసు నమోదు చేశారు. అయితే ఒక ప్రధాన నిందితుడు నిర్భయంగా ఇలా ఇక్కడే వీడియోను రిలీజ్ చేయడం గమనార్హం.

Read More:

Chakka Jam: దేశవ్యాప్తంగా రైతుల ‘చక్కా జామ్’.. చెదురుముదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతం..

ఏడాది గడిచినా అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..?

Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికే ప్రమాదకరం: రాహుల్ గాంధీ