మహాత్మగాంధీ మనుమరాలు ఉషా గోకని కన్నుమూత

దేశంలో మహాత్మగాంధీ అంటే తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్లకు గాంధీ తాత అంటే సుపరిచితమే.

మహాత్మగాంధీ మనుమరాలు ఉషా గోకని కన్నుమూత
Usha Gokani

Updated on: Mar 22, 2023 | 8:41 AM

దేశంలో మహాత్మగాంధీ అంటే తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్లకు గాంధీ తాత అంటే సుపరిచితమే. అయితే మహాత్మ గాంధీ మనుమరాలు  ఉషా గోకనీ కన్నుముశారు. మంగళవారం ముంబాయిలో ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 89 ఏళ్లు. గత ఐదేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల నుంచి ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె కన్నుమూశారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధికి గతంలో ఉషా గోకనీ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. మహాత్మ గాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలోనే ఆమె బాల్యం గడిచింది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..