Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ట్విట్ చేశారు. మహావికాస్ అఘాడీ కోరల్లో చిక్కుకున్న శివసేనకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ పేర్కొన్నారు. శివసేన కార్యకర్తలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఏక్నాథ్ షిండే సూచించారు. ఈ పోరాటం పార్టీ కార్యాకర్తల అభ్యున్నతి కోసమే అంటూ శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. అధికారంలో ఉన్న మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ఎందుకు ఎంచుకున్నానో అర్ధం చేసుకోవాలంటూ పేర్కొన్నారు. దీంతోపాటు ఏక్నాథ్ షిండే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే చిమన్‌రావ్ పాటిల్ మాట్లాడుతున్న వీడియోను కూడా షేర్ చేశారు. దీనిలో పాటిల్ మాట్లాడుతూ.. తాము సాంప్రదాయకంగా ఎన్‌సిపి, కాంగ్రెస్‌లకు ప్రత్యర్థులం, నియోజకవర్గాలలో మా ప్రధాన ప్రత్యర్థులు వారేనని.. వారితో సహజంగా పొత్తు పెట్టుకోవాలని తాము సిఎం ఉద్ధవ్ థాక్రేని అభ్యర్థించామన్నారు. సీఎం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తమ నాయకుడు ఏక్నాథ్ షిండే నిలబడ్డారని.. పేర్కొన్నారు. ఎందుకంటే ప్రతి శివసేన కార్యకర్త సహజ పొత్తును కోరుకుంటున్నారన్నారు. ఈ తిరుగుబాటుకు మూడింట.. రెండు శాతం (2/3) శివసేన ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే చిమన్‌రావ్ పాటిల్ వీడియోలో తెలిపారు.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం గౌహతి క్యాంప్‌లో ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న 16 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. వారు తమ రాతపూర్వక సమాధానాలను దాఖలు చేయడానికి జూన్ 27 వరకు సమయం ఇచ్చినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. మరోవైపు, ఈరోజు మధ్యాహ్నం సిఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. దీనిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయడానికి పార్టీ పేరు లేదా బాలాసాహెబ్ థాకరే పేరును ఎవరూ ఉపయోగించకూడదని పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సిఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే తన వర్గానికి “శివసేన బాలాసాహెబ్” అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
प्रिय शिवसैनिकांनो,
नीट समजून घ्या, म.वि.आ. चा खेळ ओळखा..! MVA च्या अजगराच्या विळख्यातून शिवसेना व शिवसैनिकांना सोडवण्यासाठीच मी लढत आहे. हा लढा तुम्हा शिवसैनिकांच्या हिता करीता समर्पित…. आपला एकनाथ संभाजी शिंदे.#MiShivsainik— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 25, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..