Work out at Gym: జిమ్‌లో వ్యాయామం చేస్తూ వృద్ధుడు మృతి..! అసలేం జరిగిందంటే..

జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఓ వృద్ధుడు కుప్పకూలి మరణించాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని వసాయ్ పట్టణంలో బుధవారం (జనవరి 18) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Work out at Gym: జిమ్‌లో వ్యాయామం చేస్తూ వృద్ధుడు మృతి..! అసలేం జరిగిందంటే..
Elderly Man Dies At Gym

Updated on: Jan 19, 2023 | 9:59 AM

జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఓ వృద్ధుడు కుప్పకూలి మరణించాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని వసాయ్ పట్టణంలో బుధవారం (జనవరి 18) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ నగరంలోనున్న ఓ జిమ్‌లో రోజూ మాదిరిగానే ప్రహ్లాద్ నికం (67) అనే వృద్ధుడు బుధవారం వ్యాయామం చేయడానికి వెళ్లాడు. ఐతే జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో ఉదయం 7 గంటల 30 నిముషాలకు ప్రహ్లాద్ నికం ఒక్కసారిగా కుప్పకూలాడు. జిమ్‌ సిబ్బంది హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు వృద్ధుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రహ్లాద్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.