ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ముంబై.. పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

ముంబై శివార్లలోని మీరా రోడ్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నయా నగర్‌లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఘోరమైన కత్తి దాడి కేసును ముంబై ఉగ్రవాద వ్యతిరేక దళం (ATS) తన చేతుల్లోకి తీసుకుంది. ప్రాథమిక విచారణలో వెల్లడైన నిజాలు భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ముంబై.. పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!
Accused, Zubair

Updated on: Apr 28, 2026 | 11:30 AM

ముంబై శివార్లలోని మీరా రోడ్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నయా నగర్‌లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఘోరమైన కత్తి దాడి కేసును ముంబై ఉగ్రవాద వ్యతిరేక దళం (ATS) తన చేతుల్లోకి తీసుకుంది. ప్రాథమిక విచారణలో వెల్లడైన నిజాలు భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

ఆదివారం (ఏప్రిల్ 26)తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో, నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద రాజ్‌కుమార్ మిశ్రా, సుబ్రోతో సేన్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. 31 ఏళ్ల జుబేర్ అన్సారీ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని, మొదట వారి పేర్లు, మతం అడిగి తెలుసుకున్నాడు. అనంతరం వారిని బలవంతంగా ‘కల్మా’ పఠించమని హుకుం జారీ చేశాడు. వారు నిరాకరించడంతో, తన వద్ద ఉన్న కత్తితో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు గార్డులు తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా సమాచారంతో ‌నిందితుడు జుబేర్ అన్సారీని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, అతని వద్ద లభించిన ఒక లేఖ దర్యాప్తును మలుపు తిప్పింది. ఆ లేఖలో ISIS, లోన్ వోల్ఫ్ (Lone Wolf), జిహాద్, గాజా వంటి పదాలు రాసి ఉన్నాయి. “ఓ ముష్రిక్కులారా, ఇప్పటి నుండి బిలాద్ హింద్‌లో మీరు నిజమైన జిహాద్‌ను చూస్తారు! ఒంటరి తోడేళ్ళు (Lone Wolves) మీపై దాడి చేస్తాయి” అని రాసి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబం, తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూనే, “గాజాకు స్వేచ్ఛ లభించును గాక” అని కూడా అతను ఆ నోట్‌లో పేర్కొన్నాడు.

ఈ దాడి కేవలం ఒక వ్యక్తిగత గొడవ వల్ల జరిగిందా లేక దీని వెనుక ఏదైనా ఉగ్రవాద కుట్ర ఉందా అనే కోణంలో ATS దర్యాప్తు చేస్తోంది. నిందితుడు మతపరమైన భావజాలంతో ప్రభావితమై ఈ ‘లోన్ వోల్ఫ్’ దాడికి పాల్పడి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి డిజిటల్ ఫుట్‌ప్రింట్స్, మొబైల్ డేటా, సోషల్ మీడియా చాట్స్, బ్రౌజింగ్ హిస్టరీని ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అతను ఎవరితోనైనా టచ్‌లో ఉన్నాడా? లేదా సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనతో మీరా రోడ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us